టొయోటా నుండి కొత్త రకం వెహికల్ మార్కెట్ లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. కొరొలా పేరుతో వస్తున్న ఈ వాహనపు మోడల్ ఇమేజ్ ను ఈమధ్యనే టోయోటా రిలీజ్ చేయడం జరిగింది. ఇంతకుముందు జపనీస్ టెక్నాలజీతో వచ్చిన కొరొలా చూసే ఉంటారు. ఇప్పుడు అదే మోడల్ తో టోయోటా తమ కస్టమర్స్ కోసం సరికొత్త కొరొలా సెడన్ రిలీజ్ చేస్తుంది.  


ఈ వెహికల్ ముందునుండి చూస్తే చాలా గ్రాండ్ లుక్ తో వైడర్ గా కనిపిస్తుంది.. వాహనం అన్నివైపులా ఎంతో చూడచక్కని ఆకర్షణమైన లుక్ తో కనబడుతుంది. ఇక వీల్స్ లో అల్లీస్ కూడా ఎంతో కొత్తగా డిజైన్ చేయబడినవి.. ఈ సరికొత్త కొరొలా పెట్రోల్ ఇంజిన్ 1.8 లీటర్స్ సామర్ధ్యంతో ఫోర్ సిలిండర్ పెట్రోల్ తో 138బి.హెచ్.పి పవర్ తో 173ఎన్.ఎం టార్క్ అందుబాటులో ఉంటుంది.


ఇంజిన్ సామర్ధ్యాన్ని బట్టి వాహనం యొక్క ఎంత బాగా పనిచేస్తుంది అన్న విషయాలు వ్యక్తీకరమవుతాయి. టొయోటా వెహికల్ కొరొలా వాహనదారులకు సరికొత్త ప్రయాణపు సౌలభ్యాన్ని అభిరుచిని కలిగిస్తుంది. ప్రస్తుతం ఇది మార్కెట్ లో రిలీజ్ అయ్యేది 2017లోనే.. కేవలం దీని డిజైన్ ఇలా ఉంటుంది అన్న ఇమేజెస్ మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: