పియాజియో గ్రూప్ నుండి వచ్చిన స్కూటర్ వెస్పా తన ఐకానిక్ కలర్ స్కూటర్ ను ఇండియాలో రిలీజ్ చేయాలని చూస్తుంది. రెడ్ కలర్ కు ఎంత పవర్ ఉంటుందో అందరికి తెలుసు. ఇప్పుడు అదే పవర్ తో వెస్పా స్కూటర్ రెడ్ కలర్ లో రాబోతుంది. వెస్పా 946 రెడ్ ఇప్పటిదాకా ఇతర దేశాల్లోనే అందుబాటులో ఉండేది కాని ఇప్పుడు అది ఇండియాలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.


125 సిసి, 150 సిసి కెపాసిటీ కలిగిన ఈ వెస్పా రెడ్ స్కూటర్ 71,058 రూపాయల నుండి 97,372 రూపాయల ఎక్స్ షో రూం ప్రైజ్ తో రాబోతుంది. ఇక మోడల్ ను బట్టి ఈ ధరలో 5వేల నుండి 10వేల వరకు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఫేవరెట్ కలర్ రెడ్ కలర్ లో రాబోతున్న వెస్పా ఎలాంటి సేల్స్ కలిగి ఉంటుందో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: