మారుతి సుజుకి నుండి రిలీజ్ అయిన క్రాస్ ఓవర్ మోడల్ ఎస్ క్రాస్ కు చిన్న చిన్న మెరుగులు దిద్ది ఫైనల్ గా మార్కెట్ లోకి రిలీజ్ చేశారు నాలుగు వేరియెంట్లలో రిలీజ్ చేసే ఈ వెహికల్ ధర 8.50 లక్షల నుండి 11.30 లక్షల వరకు ఉన్నాయి. మారుతి సుజుకి ఎస్ క్రాస్ కస్టమర్స్ ను ఆకట్టుకుంటుందని అన్నారు మారుతి సుజుకి సిఈఓ కెనిచి ఆయుకవా.


ముఖ్యంగా ఈ ఎస్ క్రాస్ సిటీలలో ఎక్కువ కస్టమర్స్ ను ఎట్రాక్ట్ చేసేందుకు ఉపయోగపడుతుందని అంటున్నారు. స్మార్ట్ హైబ్రిడ్ సిస్టెంతో ఈ వెహికల్ తయారు చేయడం జరిగింది. ఇక ఈ ఎస్ గ్రాస్ వెహికల్ కోసం అభివృద్ధికి మారుతి సుజుకి 100 కోట్ల పైగా బడ్జెట్ పెట్టేసిందట. మరి ఈ సరికొత్త ఎస్ క్రాస్ వెహికల్ ఎలాంటి సేల్స్ ను కలిగి ఉంటుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: