సాధారణంగా మనం తినే గుడ్డులో ఎన్నో పోషక విలువలతో పాటు ఔషదాలు కూడా దాగిఉన్నాయి. గుడ్డుతో ఎన్నో రకాల వంటకాలు చేసుకుంటాం..పిల్లలకు పౌష్టిక ఆహారంగా పెడతాం.. గుడ్డు తింటే ఆరోగ్యం అని తెలుసు కానీ అందానికి కూడా మేలు చేస్తుందని చాలామందికి తెలియదు.


 అందుకే కొన్ని టిప్స్ మీకోసం.

రెండు టీ స్పూన్ల గుడ్డు సొనలో ఒక స్పూన్ ఆలీవ్ ఆయిల్ , ఒక స్పూన్ నిమ్మకాయ రసం కలిపి ముఖానికి రాసుకోవాలి . పదిహేను నిమిషాల తరువాత గోరువెచ్చటి నీళ్లతో కడిగేయాలి . దీని వల్ల చర్మం మెత్తగా, కాంతివంతంగా తయారవుతుంది.


చేతులకు వాక్సింగ్ చేసుకున్నాక ఒక టేబుల్ స్పూను గుడ్డు సొనలో ఒక టీ స్పూన్ తేనె కలిపి చేతులకు రాసుకోవాలి. ఓ పదిహేను నిమిషాల తరువాత కడిగేయాలి. దీనివల్ల చర్మంపైన ఉన్న బ్లాక్ హెడ్స్ మాయమవుతాయి.


జుట్టు మెత్తగా ఉండటానికి కూడా గుడ్డు సొన బాగా ఉపయోగపడుతుంది . హెన్నలో గుడ్డు సొన కలిపి పట్టుకుంటే జుట్టుకి మంచి కండీషనర్ గా ఉంటుంది .


ఒక గిన్నెలోకి గుడ్డు సొన, టీ స్పూన్ తేనె, టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, కొంచెం నిమ్మరసం తీసుకుని బాగా కలిపి ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల తరువాత కడిగేస్తే ముఖం పై రాషేస్ తగ్గి కోమలంగా తయారవుతుంది.   


మరింత సమాచారం తెలుసుకోండి: