మనిషికి అందం ఎంత ముఖ్యమో జుట్టు కూడా అతే ముఖ్యం..ఎంత అందంగా ఉన్నా కూడా జుట్ట పీలగా ఉండటం..తెల్లగా కనిపించడం, బట్ట తల లాంటి ఇబ్బందులతో చాలా మంది బాధపడుతుంటారు. అయితే ఎంత ఆరోగ్యంగా ఉన్నా కొంత మందికి త్వరగా జుట్టు నెరసిపోతుంది.  దీనికోసం ఎన్నో ట్రీట్ మెంట్స్ చేసుకుంటారు..షాంపోలు వాడుతుంటారు కానీ ఫలితం మాత్రం శూన్యం. ఉపయోగపడతాయి. మీ కోసం గానూ, జుట్టు నెరవటాన్ని సమర్థవంతంగా నివారించే, సహజ ఆహార పదార్థాలతో జుట్టు నెరవకుండా చేయవచ్చు. 
జుట్లు త్వరగా  నెరవకుండా ఉండేందుకు చిట్కాలు :
పచ్చని ఆకుకూరలు :  పచ్చని ఆకుకూరలు తలపై చర్మానికి కావలసిన విటమిన్ 'B'ని కలిగి ఉంటాయి. వెంట్రుకలకు కావల్సిన పోషకాలను మరియు ఆక్సిజన్ ను అందించే, ఎర్రరక్త కణాల ఉత్పత్తికి, విటమిన్ 'B6' మరియు 'B12' అవసరం. వెంట్రుకలు వాటి సహజ రంగును నిలిపుకోటానికి విటమిన్ 'B2' అవసరం, మరియు ఇదే విటమిన్ హార్మోన్ ల ఉత్పత్తిలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. సంక్లిష్ట విటమిన్ 'B'లను పచ్చని ఆకుకూరలు పుష్కలంగా కలిగి ఉంటాయి. కావున మీరు పాటించే ఆహార ప్రణాళికలో వీటిని తప్పక కలుపుకోండి.
సాల్మన్ చేప : అన్ని రకాలుగా ఆరోగ్యాన్ని పెంచే ఆహార పదార్థాల పట్టికలో సాల్మన్ చేప ముందు ఉంటుంది. కావున, వెంట్రుకల ఆరోగ్యకమైన పెరుగుదలకు, సాల్మన్ చేపలను తినండి. సాల్మన్ చేపలలో ఉండే సెలీనియం, వెంట్రుకల పెరుగుదలకు, జుట్టుకు కావలసిన హార్మోన్ల ఉత్పత్తికి మరియు వెంట్రుకల వాటి రంగును శాశ్వతంగా కలిగి ఉండటానికి ఈ మూలకం తప్పని సరి. కావున, వారంలో కనీసం రెండు నుండి మూడు వారాల పాటూ, సాల్మన్ చేపలను తిని కలిగే మార్పులను గమనిచండి. 
స్ట్రాబెర్రీలు : స్ట్రాబెర్రీలు, పుష్కలంగా విటమిన్ 'C' లను కలిగి ఉంటాయి, ఈ విటమిన్ కొల్లాజన్ ను ఉత్పత్తి చెందించి, వాతావరణం నుండి శరీరంలో, జుట్టులో ప్రవేశించిన ఫ్రీరాడికల్ లకు వ్యతిరేఖంగా పోరాడతాయి. ఇవి రుచికరంగా ఉండటమే కాకుండా, ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదల మరియు వాటి రంగు నిలిచి ఉండటంలో ముఖ్య భూమికను పోషిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ లను కలిగి వాటిని తినటం వలన కూడా జుట్టు రంగు నెరవకుండా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ 'A' పసుపు రంగు పండ్లలో మరియు నారింజ పండ్లలో ఉంటుంది, మరొక యాంటీ ఆక్సిడెంట్ అయినట్టి విటమిన్ 'E' బీన్స్ మరియు నట్స్ లలో ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: