మహిళల ఆరోగ్యానికి సరైన పోషక ఆహారం ఎంతైనా అవసరం కానీ సమయా భావం కారణంగా సరైనా ఆహారాన్ని తీసుకోలేకపోతున్నారు. అటువంటివారికి పాలు చక్కగా ఉపకరిస్తాయి. మహిళలకు అందుబాటులో ఉండే అత్యంత బలవర్థకమై ఆహారమైన పాలు ఒకటే పాలు. అతి తేలిగ్గా జీర్ణమయ్య ఆహారం మాత్రమే కాకుండా మంచి ఆరోగ్యాన్ని ఆయుర్థాయాన్ని కూడా పెంచుతుంది. మహిళలకు వయస్సు మీరే కొద్ది కాల్షియం తగ్గి ఎముకలు విరగడం, ఎముకలకు సంబంధించి వ్యాధులు సోకడం వంటివి జరుగుతున్నాయి.

 

స్త్రీలు చిన్న వయసుస నుంచే పాలను తీసుకోవడం ఎంతైన అవసరమని వైద్య నిపుణులు పేర్కొన్నారు. నోటిలో దంతాలు ఆరోగ్యకరంగా అభివృద్ధి చెందడానికి కూడా కాల్షియం బాగా ఉపకరిస్తుందని వారు తెలుపుతున్నారు. పాలలో 87 శాతం నీరు, 4 శాతం కొవ్వు పధర్థాలు, 4.9 శాతం కార్బోహైడ్రేట్లు, 3.35 వాతం ప్రోటీన్లు, 0.75 శాతం ఖనిజ లవణాలు లభిస్తాయి. పాలలో లాక్టోసు అనే విశిష్టమైన చక్కెర పూర్తిగా కరిగిపోయి ఉంటుంది.


అంతేకాక ఇందులో ఎ.బి,సీ, మరియు డి విటమిన్లు కూడా లభిస్తాయని నిపుఫణులు అంటున్నారు. చిన్నవయసు అంటే 7-10 లోపు వయస్సు గల అమ్మాయిలు రోజుకు సమారు 3-4 గ్లాసుల పాలు, పెరిగే వయసులో నాలుగు గ్లాసుల కంటే ఎక్కవ పాలు, పాతికేళ్ల వయసులో 2 గ్లాసులు పాలు రోజూ తీసుకోవాలని వైద్యులు తెలుపుతున్నారు  

మరింత సమాచారం తెలుసుకోండి: