మనిషి అందంగా కనిపించాలంటే అన్ని అవయవాలు సరిగా ఉండాలి..ముఖ్యంగా మెడ నుంచి ముఖభాగం ఎంత అందంగా ఉంటే అంతగా ఆకర్షింపబడతారు. అయితే కొంత మంది ఎంత అందంగా ఉన్నా మెడ నల్లగా మారడం తో చాలా ఇబ్బందులు పడుతుంటారు.   శరీరం అంతా తెల్లగా ఉండి, మెడ క్రింద చాలా నల్లగా ఉంటుంది. గీతలు,గీతలుగా ఉండి మందపాటి అట్టలాగా పేరుకు పోయిన నలుపుతో వారు నలుగురులోకి రావడానికి ఇబ్బంది పడుతుంటారు.


తెల్లటి శరీరఛాయ ఉన్నా, మెడ కింద నలుపు వల్ల అందరితో చొరవగా కలవలేక పోతుంటారు. అటువంటి వారు మెడ కింద నలుపు పోగొట్టుకోడానికి ఈ చిట్కాని పాటించి చూడండి. నెల రోజుల్లో ఫలితం కనపడుతుంది. బంగాళాదుంప తురుములో తేనె కలపాలి. ఆ మిశ్రమాన్ని మెడకు పట్టించి మృదువుగా స్ర్కబ్ చేయాలి.


అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఒక నెల రోజుల పాటు ఇలా చేస్తే మెడ కింద నలుపు తగ్గతుంది. పాలలో నిమ్మరసం కలిపి మెడకు అప్లయి చేయాలి. ఇలా చేస్తే మెడ నలుపు తగ్గి స్మూత్ గా తయారవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: