ఈ రోజుల్లో నిజంగానే పచ్చికూరలు... మొలకెత్తిన ధాన్యాలు తినడం ఒక ఫ్యాషన్ లాగా అయిపోయింది. అయితే అందరూ వీటిని తినవచ్చా ? ముమ్మాటికీ తినకూడదు ఎందుకనీ ? అంటే అందుకు చాలా కారణాలున్నాయి. కూరలును వండటం వల్ల అందులో పోషకాలు తగ్గుతాయన్నది అందరికీ తెలిసిన సత్యమే, ఎంతవరకు తగ్గుతాయన్నది. వండే విధానం మీద ఆధారపడి వుంటుంది. అసలీ వండటమనే ప్రక్రియ ప్రాధానోద్దేశం రుచికరమైన ఆహారం మాత్రం కాదు మరి ! ఆహారం తేలిగ్గా జీర్ణమయ్యేందుకు సురక్షితంగా ఉండేందుకు అయితే రానురాను రుచులు పెరిగి వండటం అనేది సంక్షిప్త విధానంగా మారింది.


ఆహారం రంగు, రుచి, వాసన ఆకర్షణీయంగా ఉండేందుకు వండేటపుడు చేర్చే పధార్థాల సంఖ్య పెరుగుతూ పోతుంది. ఎక్కువగా నూనెతో వేయించడం వల్ల రిఫైన్డ్ పధార్థాలను వాడటం వల్ల ఆయా పధార్థాల నుంచి శరీరానికి అందాల్సిన ఫోషకాలు సరిగా అందడంలేదు. లాభాలేంటి ? ప్రాసెస్ చేయని, వండని ఆహారమేదైనా వచ్చి ఆహారం కిందే లెక్క తాజా కూరగాయలు, పండ్లు, గింజలు, డ్రైప్రూట్స్, ఇవన్నీ వచ్చి ఆహారమే కదా, మన ఆహారంలో కనీసం 45 శాతం ఇలాంటిది ఉండవచ్చు.


పచ్చి ఆహార పధార్థాలను పరిమితంగా తీసుకుంటే ఏమౌతుందంటే... 1.శక్తి పొందుతుంది. 2. చర్మం కాంతిలీనుతుంది. 3. జీర్ణప్రక్రియ మెరుగవుతుంది 4. బరువు తగ్గుతారు. 5.గుండెజబ్బులోచ్చే ప్రమాదం తగ్గుతుంది. జాగ్రత్తలూ అవసరం పచ్చివి తినమన్నారు కదాని ఎలా పడితే అలా తినేయకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అచ్చంగా పచ్చివే తిన్నా మళ్లీ పోషకాలు సరిపోవు, అందువల్ల పరిమితంగానే వీటిని తీసుకోవాలి.  అదీ తగిన జాగ్రత్తతో...  

మరింత సమాచారం తెలుసుకోండి: