దంతాలు తెల్లగా మెరవాలన్నా, చిగుళ్లు ఆరోగ్యంగా ఉండాలన్నా కొన్ని పళ్లు తింటే సరిపోతుంది. పళ్లనే శుభ్రంగా ఉంచే ఆ పండ్లు ఇవే.


- అరటి పండులో ఉండే పీచుపదార్థం పంటిమీద అతుక్కుపోయిన ఆహారాన్ని తొలగించడంలో బాగా పనిచేస్తుంది. దంతాల్ని తెల్లగా మెరిసేలా చేస్తుంది.


- యాపిల్ తింటే చిగుళ్లపై ఉండే గార తొలగిపోతుంది.


- కమలా, బత్తాయి వంటి ఫలాల్లో ఉండే సిట్రిక్ ఆమ్లం నోటిలో ఆమ్ల మోతాదు ఎక్కువ తక్కువ కాకుండా సరిచేస్తుంది. అలాగే మన శరీరంలోనే తయారయ్యే మౌత్ వాష్.. లాలాజలాన్ని వృద్ధి చేస్తుంది.


- పుచ్చకాయను తింటే దంతాలు, చిగుళ్లపైన నెమ్మదిగా బ్రష్ చేసినట్టే అవుతుంది.


- ఒక స్ట్రాబెర్రీ తీసుకొని మెత్తగా చేసి అందులో కాస్త బేకింగ్ సోడా కలపాలి. ఈ మిశ్రమాన్ని పళ్లమీద రాసి ఐదు నిమిషాలపాటు సున్నితంగా మర్దన చేస్తే పళ్లు శుభ్రమవడమే కాకుండా మెరుస్తాయి

మరింత సమాచారం తెలుసుకోండి: