మనదేశంలో దాదాపు అందరి ఇళ్లల్లో ఉండే మొక్క తులసి.. మనం తులసి మొక్కకు పూజలు, ప్రార్థనలు చేయడం సర్వ సాధారణం. అంతటి పవిత్రమైన తులసిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. తులసి ఆకులను, వేర్లను వివిధ రకాల మందుల తయారీలో వాడుతుంటారు. ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంతో పాటు, కిడ్నీలో ఏర్పడిన రాళ్ళను తొలగిస్తుంది. శరీరానికి టానిక్‌లా పని చేస్తుంది. అంతేకాదు జలుబు, ఫ్లూ వంటి వ్యాధులను తగ్గించటానికి, శ్వాస వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి, జ్వరం తగ్గించటానికి తులసి దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది.

 Image result for tulasi

పురాతన కాలం నుండి భారతదేశంలో వైద్య నిపుణులు వివిధ రకాల ఔషధాల తయారీలో తులసిని వాడుతున్నారు. తులసి మొక్కలోని అన్ని భాగాలకు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే గుణాలు ఉన్నాయి. ఒత్తిడికి గురైన సమయంలో తులసి ఆకులను తినడం వల్ల శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. అంతేకాకుండా ఒత్తిడి వలన మెదడుపై కలిగే ప్రతికూల ప్రభావాలను కూడా తగ్గిస్తుంది. సహజంగా ఒత్తిడి తగ్గాలంటే రోజులో రెండు సార్లు 10 నుండి 12 తులసీ ఆకులను నమలండి. రోజులో కలిగే ఒత్తిడి నుండి టెన్షన్ లకు దూరంగా ఉండటానికి తులసితో చేసిన టీని తాగడం బాగా ఉపయోగకరం. దీంతో ఎలాంటి దుష్ప్రభావాలు కలగవు.

 Image result for tulasi

 తులసి ఆరోగ్యంతో పాటు అందానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే తులసిని సర్వరోగ నివారిణి అంటారు. తులసి ఆకుల్ని నీడలో ఆరబెట్టి పొడి చేసి తేనె లేదా పెరుగుతో పాటు సేవిస్తే చాలా రోగాలు నయమవుతాయి. పాలతో మాత్రం తీసుకోకూడదు. పొద్దున్నే అల్పాహారానికి అరగంట ముందు తులసి రసాన్ని సేవిస్తే జీర్ణశక్తి మెరుగవుతుంది. మలేరియా వచ్చినపుడు ఐదు నుంచి ఏడు తులసి ఆకులను నలిపి మిరియాల పొడితో తీసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. పది గ్రాముల తులసి రసాన్ని పది గ్రాముల అల్లం రసంతో కలిపి తీసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. పిల్లలకు వాంతులు అవుతున్నప్పుడు కొద్దిగా తులసి విత్తనాలను పెరుగు లేదా తేనెతో కలిపి నాకిస్తే అవి తగ్గుముఖం పడతాయి. నల్ల తులసి రసాన్ని మిరియాలపొడిలో వేసి ఆ మిశ్రమాన్ని నూనె లేదా నెయ్యితో కలిపి సేవిస్తే గ్యాస్ట్రిక్ బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. తులసి ఆకులను నీళ్లలో మరిగించి తీసుకుంటే చెవి నొప్పికి మంచి మందుగా పనిచేస్తుంది. నల్ల తులసి ఆకుల్ని ఏడు బాదం పప్పులు, నాలుగు లవంగాలను కలిపి తింటే జీర్ణశక్తికి చాలా మంచిది.

Image result for black tulsi

నల్ల తులసి ఆకులు, తేనేను సమపాళ్లలో కలిపి కళ్లకు రాస్తే అలసట తగ్గడమే కాకుండా కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. ఇరవై ఐదు గ్రాముల తులసి రసాన్ని రెండు గ్రాముల నల్ల ఉప్పును కలిపి నాలుగు రోజులు క్రమంగా తీసుకుంటే నులిపురుగులు నశిస్తాయి. ఆస్తమా రోగులు ప్రతి రోజూ ఐదు నుంచి ఇరవైఐదు గ్రాముల నల్లతులసి రసాన్ని తేనేతో కలిపి తీసుకుంటే మంచిది. గొంతు ఇన్ఫెక్షన్‌కు తులసి దివ్యౌషధంగా పనిచేస్తుంది. గొంతు ఇన్ఫెక్షన్‌తో బాధపడేవారు ప్రతీరోజు నీళ్లలో తులసి ఆకులు వేసుకుని తాగినట్టయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: