మగువలు అందంగా- ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా మీరు తినే ఆహరంలో చేపలు, సోయాబీన్స్ లు తీసుకుంటే హెల్తీగా, బ్యూటీగా తయారవుతారని ఆరోగ్యనిపుణుల అంటున్నారు. చేపలు : వీటినుంచి ఒమేగా-3 ఫ్యాట్యాసిడ్లు లభిస్తాయి. ఇవి మొటిమల దగ్గర నుంచి సోరియాసిస్ వరకు అనేక చర్మవ్యాధుల మీద ప్రభావం చూపుతాయి.


సాల్మన్, మెకరెల్, సార్టైన్లు ట్యూనాచేపలు నుంచి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ లభిస్తాయి. వారానికి కనీసం మూడుసార్లు వీటిని తీసుకుంటే మంచిది. చేపలు తినని వారు వీటి జెర్మ్ఆయిల్, సోయాబీన్స్ లేదా సోయాబీన్ ఆయిల్ తో ఈ లోటు భర్తీ చేయవచ్చు . సోయా బీన్స్ : వీటిలో ఉండే ఫైటో ఈస్ట్రో జెన్స్ ఈస్ట్రోజెన్ హార్మోన్ వలే పనిచేనస్తాయి.


ఇవి చర్మన్ని పొడిబారనివ్వవు. అలాగే వృద్ధాప్యాన్ని వాయిదా వేస్తాయి. చర్మం ముడతలు పడనీయకుండా వీటి నుంచి విటమిన్ ఇ కూడా లభిస్తుంది. ఇవి కణాల పెరుగుదలకు దోహదపడుతుంది. రెగ్యలర్ గా చేపలు, బీన్స్ లు వారంలో మూడు సార్లు తీసుకుంటే ఆరోగ్యానికి, అందానికి ఏలోటు వుండదు.

మరింత సమాచారం తెలుసుకోండి: