కుంకుమ పువ్వు చాలా అరుదుగా లభిస్తుంటుంది. దీన్ని ఎక్కువగా గర్భిణీలు వాడుతుంటారు.  స్త్రీలు గర్భధారణ సమయంలో కుంకుమపువ్వును తీసుకోవడం ద్వారా అనేక రకాల సమస్యల నుంచి బయటపడచ్చంటున్నారు వైద్యులు. కుంకుమ పువ్వు తీసుకోవడం అనేది గర్భవతి స్త్రీలకు చాల సురక్షితం. దీనిని మనదేశంలో వంటకాలలో మసాలాగా వాడుతుంటారు. ఇందులో అనేక రకాలైన మంచి లక్షణాలు ఉన్నాయి. కొన్ని సంవత్సరాలుగా కుంకుమ పువ్వును దెబ్బలను, గాయాలను తగ్గించడానికి ఉపయోగిస్తున్నారు. దీనిని గర్భాశయ ఉద్దీపనకు కూడా ఉపయోగిస్తారు. గర్భవతి స్త్రీలుకు కుంకుమపువ్వును కండరాలను బలపర్చేందుకు ఉపయోగపడుతుంది.


కుంకుమపువ్వును ఉపయోగించుకోవడానికి చాల కారణాలు ఉన్నాయి. జీర్ణ వ్యవస్థను క్రమపద్ధతిలో నిర్వహించేందుకు సహాయపడుతుంది కుంకుమపువ్వు, దీన్ని తీసుకోవడం వల్ల ఆకలి ఎక్కువగా వేసేలా చేస్తుంది. గర్భవతి స్త్రీల మనసు చంచల తత్వాన్ని కలిగి ఉంటుంది. కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల వారి మనసు నిర్దిష్టంగా మారుతుంది. గర్భవతి స్త్రీల రక్త ప్రసరణ కొంచెం సేపు ఎక్కువగా కొంచెం సేపు తక్కువగా ఉంటుంది. కుంకుమపువ్వు తీసుకోవడం వలన రక్తప్రసరణ బాగా జరుగుతుంది.


గర్భవతి స్త్రీ కుంకుమపువ్వును రెండవ నెల నుంచి తీసుకోవడం మొదలు పెట్టవచ్చు. దీనిని ఉదయం, సాయంత్రం వేడి పాలతో తీసుకోవాలి. చిటికెడు కుంకుమపువ్వు తీసుకొని ఒక గ్లాస్ పాలల్లో కలవాలి. అప్పుడు మీకు దాని రుచి తెలుస్తుంది. ఆరోగ్యానికి చాలా మంచిది. కుంకుమపువ్వును షాపులో తీసుకునేటప్పుడు చాల జాగ్రత్త వహించాలి. మంచి కుంకుమపువ్వు తీసుకోకపోతే గర్భవతి స్త్రీలకు చాలా హానికరం. కనుక షాపుల్లో ఉండే లూస్ కుంకుమ పువ్వు కాకుండా ప్యాక్ చేసి ఉన్న కుంకుమపువ్వు తీసుకోవాలి. ఆ ప్యాక్ మీద ఐఎస్‌ గుర్తు కూడా గమనించి ఆ గుర్తు ఉంటేనే దానిని తీసుకొని ఉపయోగించాలి. కుంకుమపువ్వు ఎక్కువగా తీసుకోవడం కూడా హానికరం కనుక చిటికెడు మాత్రమే తీసుకోవాలి. గర్భవతి స్త్రీలు కుంకుమపువ్వు ఎక్కువగా తీసుకోవడం వలన డెలివరీ సమయంలో ఎక్కువగా గర్భస్రావం జరుగుతుంది. అందుకని తక్కువ మోతాదులో తీసుకోవాలి. కుంకుమ పువ్వు తక్కువగా తీసుకోవడం వలన గర్భధారణలో ఉన్నప్పుడు పిండోత్పత్తి  బాగా జరుగుతుంది. 


ఎక్కువగ గర్భవతి స్త్రీలకు తాగిన పాలు అరుగుదల కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకు ఒక చిటికెడు కుంకుమపువ్వుతో తీసుకోవడం వలన జీర్ణ వ్యవస్థ బాగా పని చేస్తుంది. కుంకుమపువ్వుని ఎక్కువగా స్వీట్స్, బిరియాని, ఖీర్, బ్యూటీ క్రీమ్సలలో వాడుతారు. ఇది ఎక్కువగా జీర్ణ వ్యవస్తకు ఆహార అరుగుదలకు ఉపయోగపడుతున్నది. స్త్రీలలో ఋతుక్రమం సరిగా లేకున్నా కుంకుమపువ్వు మంచి మందుగా పనిచేస్తుంది. అంతే కాకుండా పురుషులలో వంధ్యత్వానికి, ఉబ్బసం, అంధత్వం రాకుండా, కాన్సర్ నుంచి కాపాడుతుంది.


కుంకుమపువ్వు తీసుకోవడవ వల్ల పుట్టబోయే బిడ్డ చాల అందంగా పుడుతుంది. గర్భధారణ సమయంలో జీర్ణ వ్యవస్థ మంచిగా పనిచేయుటకు ఇది తోడ్పడుతుంది. కుంకుమపువ్వు జీర్ణాశయంలో కొత్త పొరను ఏర్పరచి ఆకలిని పెంచుతుంది. కుంకుమపువ్వు కడుపునొప్పిని తగ్గించి పాల ఉత్పత్తిని పెంచుతుంది. దీనిలో ఉన్న యాంటి స్పాస్పోడిక్ ప్రభావం వలన కడుపునొప్పి నిరోధకంగా పనిచేస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: