ఒక ఆపిల్ ( చిన్నది) రెండు టేబుల్ స్పూన్ల తేనె తీసుకోవాలి. ఆపిల్ ను ముక్కలు చేసి మిక్సీలో బ్లెండ్ చేయాలి. ఆపిల్ గుజ్జులో తేనె కలిపి సమంగా కలిసెట్టు ఒకసారి బ్లెండ్ చేసుకుని పదినిమిషాలసేపు ఫ్రిజ్ లో ఉంచాలి.. ఫ్రిజ్ లో నుంచి తీసిన మిశ్రమాన్ని ముఖానికి మెడకు పట్టించి వేళ్లతో వలయాకారంగా మర్థన చేయాలి. అరగంట తర్వాత కడగాలి. దీనిని నార్మల్ స్కిన్ తోపాటు డ్రైస్కిన్ వారు కూడా చేసుకోవచ్చు.

ఒక టామోటోను గింజలు తొక్క విడదీసి గుజ్జును మాత్రమే తీసుకోవాలి. అందులో రెండు టీ స్పూన్ల పెరుగు, ఒక టీ స్పూన్ కీరకాయ గుజ్జు, మూడు టీ స్పూన్ల ఓటమీల్ సైడర్ ,మూడు పుదీనా ఆకులు వేసి గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి ఐదు నిమిషాల తర్వాత వేడినీటితో కడగాలి. ఈఫ్యాక్ వారానికి ఒకసారైనా వేస్తుంటే ముఖ లావణ్యం తగ్గకుండా ఉంటుంది. జిడ్డు చర్మానికి బాగా పనిచేస్తుంది.

అదనపు జిడ్డును తొలగించడంతోపాటు టమోటాలోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని రక్షిస్తాయి. పెరుగు చర్మాన్ని పొడిబారకుండా కాపాడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: