కళ్ల కింద ఏర్ప‌డే న‌ల్ల‌ని వ‌ల‌యాలు (డార్క్ స‌ర్కిల్స్‌) అంటే ఎవ‌రికీ ఇష్టం ఉండ‌వు. కార‌ణాలేమున్నా డార్క్ స‌ర్కిల్స్ స‌హ‌జంగా అధిక శాతం మందిలో ఏర్ప‌డుతూనే ఉంటాయి. ఈ క్ర‌మంలో వీటిని త‌గ్గించేందుకు కింద ఇచ్చిన సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు. ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం. చిన్నచిన్న చిట్కాలతో ఈసమస్యల నుండి బయట పడవచ్చు. చాలా మంది కళ్ల కింద నల్లటి వలయాలకు నిద్ర సరిగా లేకపోవడం కారణం అని భావిస్తూ ఉంటారు. కాని అదినిజం కాదు. అసలు కారణాలు తెలిస్తే ఎవరికైనా షాక్ కలుగుతుంది. ఈ కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ పేరెంట్స్ నుండి హెరిటిడీగా వచ్చే అవకాశం ఉంది.  అదేవిధంగా ఎగ్జిమా కూడా కళ్ల కింద నల్లటి వలయాలకు కారణం కావచ్చు. 


కళ్ల కింద నల్లటి వలయాలు తగ్గాలంటే బ్లాక్, గ్రీన్ టీ బ్యాగులను అరగంట పాటు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఆ తర్వాత వాటిని ఒక్కో కంటి మీద పది నుంచి పదిహేను నిమిషాల పాటు పెట్టుకోవాలి. వెంటనే ముఖం కడిగిస్తే సరిపోతుంది. రోజూ ఒకటి లేదా రెండుసార్లు ఇలా చేస్తుంటే క్రమంగా వలయాలు తొలగిపోతాయి. 


విటమిన్‌-ఎ, విటమిన్‌-కె, విటమిన్‌-సి, ఐరన్‌ లాంటి వాటిని తీసుకోవడం వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడవు. అలాగే రోజూ తప్పనిసరిగా సమతులాహారం తీసుకోవాలి. ముఖ్యంగా పళ్లు, సలాడ్లు, మొలకలు, ప్రాసెస్‌ చేయని ధాన్యాలు, పెరుగు, మీగడ తీసిన పాలు, పన్నీర్‌, కాయధాన్యాలు, బీన్స్‌, ఆకుకూరలు, గుడ్డు, చేపలు బాగా తినాలి. 


కొద్దిగా పసుపులో మజ్జిగ కలిపి పేస్ట్‌లా చేయాలి. దీన్ని కళ్ల చుట్టూ రాసి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి ఒకసారి చేసినా మంచి ఫలితం లభిస్తుంది. 


దోసకాయ కళ్ల కింద ఉండే నల్లటి వలయాలను పోగొట్టడంలో బాగా పనిచేస్తుంది. అందుకే కళ్ల మీద కీరాదోసకాయముక్కల్ని పెట్టుకుని 15 నిమిషాలపాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో కళ్లను కడుక్కోవాలి. ఇలా రోజూ చేస్తే కళ్లకు చాలా మంచిది. 


పుదీనా ఆకులను పేస్ట్ చేసి.. అందులో నిమ్మరం కలిపి కళ్ల కింద రాయాలి. 20 నిమిషాల పాటు ఉంచి ఆ తర్వాత కడిగేయాలి. 


ఎగ్జిమా మాత్రమే డార్క్ సర్కిల్స్ కి కారణం కాకపోయినా.. దురద, రుద్దడం కారణంగా.. డార్క్ సర్కిల్స్ ఏర్పడే అవకాశం ఉంది. అలర్జీలు దురదకు కారణమవుతాయి. కళ్ల కింద చర్మం చాలా సున్నితంగా, పలుచగా ఉంటుంది. దురద వల్ల బ్లడ్ వెజెల్స్ లో వాపు వస్తుంది. అది కళ్ల కింద చర్మం పలుచగా ఉండటం వల్ల ముఖం అంతటిలోకి అక్కడి స్కిన్ మరింత డార్క్ గా మారుతుంది. పైన తెలిపిన సూచనలు పాటిస్తే..కళ్ల కింద ఏర్ప‌డే న‌ల్ల‌ని వ‌ల‌యాలు నయం చేసుకోవొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: