మన అందాన్ని కురులతో కూడా పోల్చి చూస్తుంటారు. కురులు వత్తుగా నల్లగా ఉంటే మంచి ఆరోగ్యంగా కూడా ఉన్నట్లే. ఒక వేళ జుట్టు కునక నల్లగా లేకుండా తెల్లగా మారితే అనారోగ్య సమస్యలో లేక కేశాల్లో లోపాలో రక రకాల బాధలు వెంటాడుతుంటాయి.

తెల్ల జుట్టు నల్లగా మార్చుకోవాలని అందరికి ఉంటుంది.కాని తోందరపాటు వల్ల షాంపులు వాడడం వల్ల జుట్టు నల్లబడకుండా ,మరో సమస్య చుండ్రు రావడం మొదలౌవుతుంది. కోన్ని ప్రాంతాలలో నీళ్లు సమస్య వల్ల కూడా జుట్టు తెల్లబడుతుంది.అయితే ఎండు ఉసిరి వల్ల తెల్లవెంట్రుకలు నల్లగా మారుతాయన్ని వైద్యులు సూచిస్తున్నారు.అందులో భాగంగా ఈ క్రింది చిట్కాలు ప్రయోగించండి.

ఎండు ఉసిరి ఒక కప్పు , రెండు కప్పుల పెరుగు తీసుకుని ఒక ఇనుప గిన్నెలో రాత్రంతా నానపెట్టాలి .మరుసటి రోజు ఉదయం ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించాలి .ఇలా వారానికి ఒక సారి క్రమం తప్పకుండా చేస్తే తెల్లజుట్టు నల్లబడుతుంది .

ఒక కప్పు ఎండు ఉసిరిని నాలుగు కప్పుల నీళ్ళల్లో వేసి చిటికెడు పంచదార కలిపి మరిగించాలి .ఈ మిశ్రమం ఒక కప్పు మోతాదుకు వచ్చిన తరువాత ఇందులో రెండు కప్పుల హన్నా పొడి , గుడ్డు సోన, నిమ్మరసం కలపాలి . ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి రెండు గంటల తరువాత తల స్నానం చేయాలి . సరిపడా హెన్నా, గుడ్డు సోన , అర చెక్క నిమ్మరసం , ఒక టేబుల్ స్పూన్ ఇన్ స్టంట్ కాఫీ పొడి వేసీ బాగా కలపాలి.ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి 45 నిమిషాలా తరువాత కడిగేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: