ప్రస్తుతం మనిషి కమ్యూనికేషన్ సేవలు విసృతంగా వాడుకుంటున్నారు. ఒకప్పుడు ఫోన్ సౌకర్యంతో మాట్లాడుకునే స్థాయి నుంచి సోషల్ మీడియాలో ఎన్నో రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా వాట్సప్ దీంతో కమ్యూనికేషన్స్ మరీ దగ్గరయ్యాయి. వాట్సాప్ తో ఫోటోలు,వీడియోలు, చాటింగ్ ఏవైనా చిటికలో అయిపోతున్నాయి. ప్రస్తుతం దాన్ని ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకుని సంవత్సరం పాటు వాడుకోవచ్చు.

సంవత్సరం పూర్తయిన తరువాత ఏడాదికి ఒక డాలర్‌ అంటే దాదాపుగా రూ.67 చెల్లిస్తే మరో సంవత్సరం వాడుకోడానికి వీలు పడుతుంది. గతంలో ఏడాది పాటు ఫ్రీ సబ్ స్క్రీప్షన్ ను పొందిన తర్వాత సేవలను కొనసాగించాలంటే రుసుము చెల్లించాలని ఇప్పటి వరకు వాట్సప్ యూజర్లకు మెసేజ్ లు వచ్చేవి. కానీ ఇప్పుడు ఆ మేసేజ్ లు కనిపించవు. ఈ విషయాన్ని సంస్థ ఓ బ్లాగ్‌ పోస్ట్‌ ద్వారా వెల్లడించింది. తమ వినియోగదారుల్లో చాలా మంది క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు లేని వారు కూడా ఉన్నారంది.

వాట్సప్


ఇలా డబ్బులు చెల్లించలేదని.. వాట్సాప్‌ లేక కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి సంబంధాలు తెగిపోతున్నాయని బాధపడుతున్నారని చెప్పింది.అందువల్లనే తాము ఈ ఛార్జీల్ని త్వరలోనే రద్దు చేయాలనుకుంటున్నట్లు చెప్పింది. ఇప్పటి వరకు వాట్పస్ కు వచ్చే రెస్పాన్స్ ను బట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.  ఇప్పటికే ఒక బిలియన్‌ వినియోగదారులు తమ యాప్‌ని వాడుతున్నట్లు తెలిపింది.



మరింత సమాచారం తెలుసుకోండి: