ప్రపంచం ఇప్పుడు అంతా ఆన్ లైన్ మయమైంది. ఒకప్పుడు మొబైల్ మార్కెటింగ్ చేసేవారు..ఇప్పుడు ఆన్ లైన్ మార్కెటింగ్ వచ్చేసింది. కోరుకున్న వస్తువు తమ ఇంటిముందే వచ్చి వాలుతున్నాయి. ముఖ్యంగా ఇండియాలో ఆన్ లైన్ నెట్ వర్కింగ్ లో అమెజాన్, ఫ్లిప్ కార్ట్,స్నాప్ డీల్  ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చాయి. చాలా మంది నెటిజన్లు  ఎక్కువ వీటినే ఫాలో అవుతున్నారు. కస్లమర్లకు ఎలాంటి అసౌకర్యం లేకుండా వీటి సేవలు కొనసాగిస్తునాయి.

తాజాగా  అమెజాన్ ఆన్లైన్ మార్కెంటింగ్ ద్వారా మార్కెట్ లోకి విడుదలైన లెనోవా కె4 నోట్ మోడల్ ఒక్క సెకన్లో పదివేల ఫోన్లు అమ్ముడుపోయాయి. అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలోనూ ఇదే స్థాయిలో సంచలనాలు నమోదు చేసింది లెనోవా.  లెనోవా కె4 మొబైల్ కోసం అడ్వాన్స్ బుకింగ్ అవకాశం కల్పించిన లెనోవా సంస్థ 4,80,566 రిజిస్ట్రేషన్లను స్వీకరించింది.

Embedded image permalink

అత్యాధునికమైన టెక్నాలజీ రూపొందిన లెనోవా కె4 ధర రూ.12,499.  ఈ మొబైల్ జనవరి 5న ఇండియన్ మార్కెట్లో రిలీజ్ చేయగా, జనవరి 19 నుంచి ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చింది. తొలి సెకన్లోనే 10,000 ఫోన్లు అమ్ముడయినట్టుగా సంస్థ తన అఫీషియల్ ట్విట్టర్లో వెల్లడించింది. 

లెనోవా ఇండియా ట్విట్ :

మరింత సమాచారం తెలుసుకోండి: