వాహన రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకున్న టీవీఎస్ మోటార్ తాజాగా మార్కెట్లోకి ఎక్స్‌ఎల్ 100ను విడుదల చేసింది. 99.7 సీసీ ఫోర్ స్ట్రోక్ ఇంజిన్‌తో తయారైన ఈ వాహనం 4.2 పీఎస్ పవర్‌తో దూసుకుపోనున్నది. ఈ వాహనం ధర రూ.30,074 గా నిర్ణయించింది. ఈ వాహనంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని లీటర్ పెట్రోల్ కి 67 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపనీ అధినేతలు తెలిపారు.

కస్టమర్ల కు నాణ్యతా ప్రమాణాలతో కూడిన వాహనాలు అందించడంలో మొదటి నుంచి సక్సెస్ సాధిస్తున్నట్లు అందుకోసమే టీవీఎస్ మోటార్స్ అంటే కస్టమర్లకు అంతగా ఇష్టపడుతున్నట్లు అలాగే అమ్మకాలు పుంజుకుంటున్నాయని టీవీఎస్ మోటార్ వైస్ ప్రెసిడెంట్ జేఎస్ శ్రీనివాసన్ తెలిపారు. ఐదు కలర్స్‌లో లభించనున్న ఈ వాహనం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో ఉన్న డీలర్ల వద్ద లభ్యమవనున్నదన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: