మొబైల్ రంగం విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఒక్కో కంపెనీ కొత్త కొత్త ఫీచర్స్ తో వినియోగదారుల సేవలో నిమగ్నమయ్యాయి. ఈ మద్య స్మార్ట్ ఫోన్ల హవా కొనసాగుతుంది..అయితే ఇప్పటికే చాలా రకాల కంపెనీలు కొత్త స్మార్ట్ ఫోన్లు ప్రజలకు అందుబాటు ధరలకు తీసుకు వస్తున్నాయి. ఇక మోబైల్ రంగంలో విస్తృత సేవలు అందిస్తున్న ఎల్ జీ కంపెనీ వారు కొత్త ఫోన్లు మార్కెట్లోకి తీసుకు వచ్చారు.  


కె సిరీస్ లో భాగంగా కె7, కె10 శ్రేణి ఫోన్ల ను మార్కెట్లోకి విడుదల చేసింది ఎల్ జీ. ఇండియాలో కె7 ధర రూ.9,500 కాగా.. కె10 ధర రూ.13,500లుగా కంపెనీ నిర్ణయించింది. కె7 ఆండ్రాయిడ్ వర్షన్లో 5.1 లాలీపాప్ తో పనిచేసే ఈ మొబైల్ లో స్టోరేజీ కోసం ప్రత్యేకంగా స్లాట్ ఉంది.  


కె7 ఫోన్ ప్రత్యేకతలు  :


5.0 అంగుళాల స్క్రీన్  ఎఫ్ డబ్ల్యూ వీజీఏ, 1.3 జీహెచ్ జెడ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 5 మెగా పిక్సెల్  ముందు, వెనక కెమెరాలు, 1 జీబీ ర్యామ్, 2,125 ఎమ్ ఏహెచ్ సామర్ధ్యం గల బ్యాటరీ, ఫ్లాష్ సౌకర్యం ఉంది. 


కె10 ఫోన్ ప్రత్యేకతలు :


 ఆండ్రాయిడ్ వెర్షన్ 5.1తో నడిచే ఈ మొబైల్ లో స్టోరేజీ సామర్ధ్యాన్ని పెంచుకోవడం కోసం ప్రత్యేకమైన స్లాట్ ను ఏర్పాటు చేశారు. 5.3 అంగుళాల స్క్రీన్ తో ఫుల్ హెచ్ డీ కలిగి ఉంది. స్నాప్ డ్రాగన్ 410 క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఫ్లాష్ ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: