అంతర్జాతీయ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌(ఐసీసీ) ఛైర్మన్‌గా భారతి ఎంటర్‌ప్రైజెస్‌ వ్యవస్థాపకుడు సునీల్‌ మిట్టల్‌ ఎన్నికయ్యారు. దాదాపు వందేళ్ల చరిత్ర కలిగిన ఐసీసీకి ఛైర్మన్‌గా ఎన్నికైన మూడో భారతీయుడు మిట్టల్‌ కావడం విశేషం. ప్రస్తుతం ఈ పదవిలో కొనసాగుతున్న ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ ఛైర్మన్‌ టెర్రీ మెక్‌గ్రామ్‌ నుంచి మిట్టల్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక నుంచి టెర్రీ ఐసీసీ గౌరవ ఛైర్మన్‌గా ఉంటారు. దాదాపు వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఐసీసీకి ఛైర్మన్‌ గా ఎన్నికైన మూడవ భారతీయుడు సునీల్ మిట్టల్‌ కావడం గమనార్హం. 



తనకు లభించిన పదవిపై స్పందించిన మిట్టల్, "ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వేళ, ఐసీసీ ఎంతో కీలక పాత్రను పోషించాల్సి వుంది, సమ్మిళిత వృద్ధికి నావంతు సహకారాన్ని అందిస్తా" అని అన్నారు. 130 దేశాలు దేశాలకు చెందిన 65 లక్షల మంది సభ్యులుగా ఉన్న ఐసీసీకి 51వ చైర్మన్ సునీల్ మిట్టల్. ప్రస్తుతం మిట్టల్‌ వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ టెలీకమ్యూనికేషన్‌ స్టీరింగ్‌ కమిటీకి ఛైర్మన్‌ గా, ఇండియా - అమెరికా, ఇండియా -బ్రిటన్, ఇండియా - జపాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఫోరంలలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఎఫ్‌టాప్సీ అధ్యక్షుడిగా రవీంద్ర మోదీ...

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎఫ్‌టాప్సీ) అధ్యక్షుడిగా రవీంద్ర మోదీ నియమితులయ్యారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను ఎఫ్‌టాప్సీ నూతన కార్యవర్గాన్ని నియమించుకుంది. హైదరాబాద్ ఫుడ్ ప్రాడక్ట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న రవీంద్ర మోదీ వ్యాపారరంగంలో విశేష అనుభవం ఉంది. అలాగే ఎఫ్‌టాప్సీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా జీ శ్రీనివాస్ నియమితులయ్యారు. 2016-17 సంవత్సరానికి వీరు ఈ బాధ్యతలు నిర్వహిస్తారు. 



బుధవారం రెడ్‌హిల్స్‌లోని ఫెడరేషన్‌ హౌజ్‌లో జరిగిన 99వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఎఫ్‌టాప్సీ నూతన అధ్యక్షుడు, సీనియర్‌ అధ్యక్షుడి ఎన్నిక జరిగింది. మోడీ ఎఫ్‌టాప్సీ మేనేజింగ్‌ కమిటీలో ఆరేళ్ల వరకు సభ్యుడిగా ఉన్నారు. 2014-15 సంవత్సరంలో ఈయన ఎఫ్‌టాప్సీ వైస్‌ ప్రెసిడెంట్‌గా, 2015-16 సంవత్సరంలో సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహించారు. సూర్య బ్రాండ్‌ పేరుతో ఆహార ఉత్పత్తులను హైదరాబాద్‌ ఫుడ్‌ ప్రొడక్ట్స్‌ తయారు చేస్తోంది. మోడీకి ఆహార పరిశ్రమలో 30 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక గౌర శ్రీనివాస్‌ ఎఫ్‌టాప్సీ మేనేజింగ్‌ కమిటీలో ఎనిమిదేళ్లకు పైగా సభ్యుడిగా ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: