యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగనుందన్న వార్తల   ప్రభావంతో  అటు వివిధ  కరెన్సీ మార్కెట్లపై నెగెటివ్ గా ఉండగా ... బులియన్ మార్కెట్  ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.    నిన్న నష్టాల్లో ఊగిసలాడిన పుత్తడి ధరలు శుక్రవారం  పరుగులు పెడుతూ దూసుకుపోతున్నాయి. ఈక్విటీల్లోని పొజిషన్లను ఉపసంహరించుకుంటున్న ఇన్వెస్టర్లు బంగారం, వెండిపై పెట్టుబడులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నాటి సెషన్లో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం విలువ  రూ. 1900కు పైగా పెరగగా కిలో వెండి ధర రూ. 1500కు పైగా పెరిగింది. 


ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ. 31,741గా ఉండగా కిలో వెండి ధర రూ. 42,500గా ఉంది. బ్రెగ్జిట్ ప్రభావం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనౌతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడిని సురక్షితంగా భావిస్తుండటంతో ధరల పెరుగుదల నమోదైతుంది. ఇక జూలై 5 నాటి కాంట్రాక్టులో వెండి ధర క్రితం ముగింపుతో పోలిస్తే రూ. 1,689 పెరిగి రూ. 42,879కి చేరింది. క్రూడాయిల్ భారత బాస్కెట్ ధర 3.96 శాతం తగ్గి రూ. 3,222 వద్ద కొనసాగుతోంది.


విశ్లేషకుల అంచనా వేసినట్టుగానే 'బ్రెగ్జిట్' ప్రభావంతో  ప్రపంచ మార్కెట్లన్నీ భారీగా  పతమవుతున్నాయి.  బ్రిటన్  ఈయూ నుంచి వైదొలగడానికి రెఫరెండం అనుకూలంగా ఉందన్న   వార్తలతో దాదాపు  గ్లోబల్ మార్కెట్లన్నీ కుదేలైనాయి.    ఈ నేపథ్యంలో భారతీయ మార్కెట్లు కూడా తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఒక దశలో     సెన్సెక్స్ వెయ్యి పాయింట్ల పైగా కోల్పోగా, నిఫ్టీ ఎనిమిదివేలకు దిగువన  ట్రేడ్  అవుతుంది. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ 89 పైసలు పడిపోయింది. డాలర్ తో రూపాయి విలువ 68.11గా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: