2005కు ముందు ముద్రించిన కరెన్సీ నోట్లను మార్చుకునే గడువు ఈరోజుతో ముగిసింది. ఈ మేరకు ఆర్బీఐ ఒక ప్రకటన చేసింది. 2005కు ముందు ముద్రించిన నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ గతంలోనే తెలిపింది. 2005కు ముందు నోట్లను బ్యాంకులో ఇచ్చి అంతే విలువైన నోట్లను తీసుకోవాలని ప్రజలకు సూచనలు కూడా చేసింది. గత ఏడాది చివరి వరకున్న గడువును మరో ఆరు నెలలు పొడిగించటం, అది కూడా నేటితో ముగియడం జరిగింది. ఈ నోట్లను ఇప్పటికీ మార్చుకోని వారుంటే దేశవ్యాప్తంగా ఉన్న ఆర్బీఐ బ్రాంచ్ లను సంప్రదించాల్సిందిగా కోరింది.



లా శాతం వరకూ ఈ నోట్లను వెనక్కి తీసుకున్నామని, ఇంకా కొంత శాతం మాత్రమే చెలామణిలో ఉందని ఆర్ బీఐ గురువారం పేర్కొంది. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా ప్రీ-2005 నోట్లను మార్చుకోవాలంటే ఆర్ బీఐకు సంబంధించిన 20 ఆఫీసులను ఆశ్రయించాల్సి ఉందని తెలిపింది. ఆర్ బీఐ ఆఫీసులు.. అహ్మదాబాద్, బెంగళూరు, బెల్లాపూర్, భోపాల్, భువనేశ్వర్, ఛండీఘర్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, కాన్పూర్, కోల్ కత్తా, లక్నో, ముంబై, నాగ్ పూర్, న్యూఢిల్లీ, పట్నా, తిరువనంతపురం, కొచ్చి ప్రాంతాల్లోనే ఇక ఇప్పటినుంచి 2005 ముందటి నోట్లను మార్చుకునే అవకాశముంటుందని ఆర్ బీఐ ఓ ప్రకటన వెల్లడించింది.  



కాగా, 2005కు ముందు ముద్రించిన నోట్లను, ఆ తర్వాతి సంవత్సరాల్లో ముద్రించిన నోట్లను గుర్తించడం చాలా సులభం. 2005 తర్వాత ముద్రించిన కరెన్సీకి వెనుక వైపు కింది భాగంలో ఏ ఏడాది ఆ కరెన్సీని ముద్రించారో ఆ వివరాలు ఉంటాయి. అదే, 2005 కు ముందు ముద్రించిన కరెన్సీలో ఆ విధంగా ఉండదు.


మరింత సమాచారం తెలుసుకోండి: