ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎప్పుడైతే బాగుపడతాయో అప్పుడే దేశం యొక్క ఆర్ధిక స్థితి , వృద్ధి బాగుపడి అభివృద్ధి పథం లో నడుస్తాయి అని ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ స్పష్టం చేసారు. ఎఫైసీసీ , ఐబీయే కలిసి నిర్వహించిన బ్యాంకింగ్ సెమినార్ లో పాల్గొన్న రాజన్ కీలకమైన వ్యాఖ్యలు చేసారు. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పాలన మరింతగా మెరుగు పడాలి అని తెలుపుతున్నారు రాజన్. బ్యాంకుల్లో చైర్మన్ , ఎండీ తదితర ఉన్నతమైన ఉద్యోగులని అనధికార డైరెక్టర్ లనీ నియమించుకునే అధికారం బీబీబీ కే వదిలేస్తూ ప్రభుత్వం చొరవ తీసుకుని నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటున్నారు ఆయన. చీఫ్ ఎక్జిక్యూటివ్ నుంచి ఈడీలు, బోర్డు డైరెక్టర్ లని కేంద్ర నిర్ణయం ద్వారా నియమిస్తున్న విషయం తెలిసిందే. ఈ తరహా అలవాటు వల్ల మంచి జరగదు అని ఛాన్స్ లు తక్కువగా ఉంటాయి అని ఇది పూర్తిగా మారి తీరాలి అంటున్నారు రాజన్. పాలనతో పాటు బ్యాంక్ మ్యానేజ్మెంట్ సంస్కరణల అమలు కూడా సమాంతరంగా జరగాల్సి ఉంది అని ఆయన అభిప్రాయ పడ్డారు. దేశంలో బ్యాంకింగ్ సేవలు అందించడం కోసం అనుమతులు పొందిన సంస్థలు మరొక ఆరు నెలల్లో తమ ప్రోగ్రాం లు మొదలు పెడతాయి అని కాని వారి ముందర అనేక ఛాలెంజ్ లు ఎదురు చూస్తున్నాయి అని రాజన్ అంటున్నారు. ఈ కంపెనీల మధ్యన నెలకొన్న పోటీ వాతావరణం కస్టమర్ లకి చాలా గొప్ప మేలు చచేస్తుంది అని చెబుతున్నారు . వారికి తమ సేవలు ఇంకా పారదర్సాకంగా , సులభతరంగా అందుతాయి అన్నది ఆయన వాదన. 


మరింత సమాచారం తెలుసుకోండి: