కేజీ డీ 6 క్షేత్రాల నుంచి అనుకున్న లక్ష్యం కంటే తక్కువ సహజ వాయువు ఉత్పత్తి చేసింది అనే కారణం తో రిలయన్స్ తో పాటు ఆ సంస్థ తో భాగస్వాములై ఉన్న సంస్థల మీద కేంద్ర ప్రభుత్వం ఏకంగా 380 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది. ఇది అత్యంత భారీ జరిమానా అని చెప్పాలి. దాదాపు 2500 కోట్ల మేరకు ఈ సొమ్ము ఉంది.ఏప్రిల్ 1 2010 సంవత్సరం నుంచి మొదలు పెట్టుకుని ఐదు ఆర్ధిక సంవత్సరాల నిర్దేశిత లక్ష్యాన్ని సదరు సంస్థ చేరుకోలేక పోయింది. దీనికి వారు వివిధ రకాలుగా తాకీదులు ఇచ్చినా కూడా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. సంస్థ లక్ష్యాన్ని చేరుకోకపోతే ఫైన్ విధించచ్చు అని అగ్రిమెంట్ లో ఉండడం తో ఈ మొత్తాన్ని జరిమానాగా విధించారు. గ్యాస్ పూల్ ఖాతా లో స్థూల 87 మిలియన్ డాలర్ లని ప్రభుత్వం ఇప్పటికే తమ దగ్గర నుంచి వసూలు చేసింది అని అవి తప్పించి మిగితా సొమ్ము తాము పే చెయ్యాల్సి ఉంది అని రిలయన్స్ వారు చెబుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: