యాపిల్ కంపెనీ అట్టహాసంగా మార్కెట్ లోకి రిలీజ్ చేసిన ఐ ఫోన్ 7, 7 ప్లస్ మోడల్స్ లో కొన్ని సమస్యలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ మోడల్ ఫోన్లను కొన్నవారు పలు రకాల సమస్యలతో మళ్లీ సర్వీస్ సెంటర్లకు పరుగులు తీస్తున్నారు. ముఖ్యంగా ఐదు సమస్యలను వారు తీవ్రంగా ప్రస్తావిస్తున్నారు. ఆ సమస్యలు మీ కోసం.


స్క్రీన్ కలర్స్ : యాపిల్ ఐఫోన్ 7, 7ప్లస్ మోడల్స్ లో స్క్రీన్ కలర్స్ వినియోగదారులను తెగ ఇబ్బంది పెడుతున్నాయట. ఫోన్లలో ఎంత కలర్ సెట్ చేసినా.. కొంత పసుపు రంగులో కనిపిస్తున్నాయి. దీంతో ఫొటోలు, వీడియోలు చూసుకునేందుకు కస్టమర్లు తెగ ఇబ్బంది పడుతున్నారు. 


హోమ్ బటన్ : హోమ్ బటన్ కు మన స్కిన్ టచ్ అయితేనే పని చేస్తోంది. మన లాంటి ఉష్ణ దేశాల్లో వినియోగదారులకు ఈ సమస్య పెద్దగా లేకున్నా.. శీతల దేశస్థులు మాత్రం ఐఫోన్ 7, 7 ప్లస్ తో తీవ్ర ఇబ్బంది పడుతున్నారట. చలి ఎక్కువగా ఉండే శీతల దేశాల్లో చేతులకు గ్లౌజులు వేసుకుంటారు. వారు ఫోన్ ను ఆపరేట్ చేయాలంటే గ్లౌజ్ తీసేయాల్సిందే. చలి ప్రదేశాల్లో ఈ ఫోన్ తో చాలా ఇబ్బందులు వస్తున్నాయన్నది కస్టమర్ల అభియోగం.


హిస్స్ గేట్ : ఐఫోన్ 7 మోడల్ లో ఫోన్ నుంచి హిస్స్ అంటూ నాయిస్ వస్తోంది. దీన్ని హిస్ గేట్ అని పిలుస్తున్నారు. ఫోన్ లో మాట్లాడేటప్పుడు, మ్యూజిక్ వింటున్నప్పుడు ఈ సౌండ్ చాలా చికాకు పెడుతోందని కస్టమర్లు కంప్లైంట్ చేస్తున్నారు. మొదట రిలీజ్ చేసిన మోడల్స్ లోనూ ఈ లోపం కనిపిస్తోంది. తర్వాత దశల్లో రిలీజ్ చేసిన మోడల్స్ లో సమస్య లేదు.


ఏరోప్లేన్ మోడ్ :  కొన్ని ఐ ఫోన్లలో ఏరోప్లేన్ మోడ్ సమస్యగా మారింది. ఒకసారి ఏరోప్లేన్ మోడ్ లోకి వెళ్తే.. మళ్లీ నార్మల్ మోడ్ లోకి రాడం లేదు.. వచ్చినా సిగ్నల్స్ అందుకోవడం లేదు. సిగ్నల్స్ కోసం ఫోన్ స్విచాఫ్ చేసి.. ఆన్ చేయాల్సి వస్తోంది.

బ్లా కలర్ ఐఫోన్: మిగతా కలర్స్ కంటే బ్లాక్ మోడల్ ను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని కంపెనీ మొదటి నుంచి చెబుతూనే ఉంది.. కానీ కస్టమర్లు పట్టించుకోలేదు. దీనివల్ల బ్లాక్ మోడల్స్ పై త్వరగా స్క్రాచెస్ పడడం జరుగుతోంది.

యాపిల్ కంపెనీ తయారు చేసిన ఐ ఫోన్ 7, 7ప్లస్ మోడల్స్ ఈ 5 సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటిని త్వరగా అధిగమించాలని యాపిల్ కంపెనీ కూడా ప్రయత్నిస్తోంది. ఎంతో ఖర్చు పెట్టి కొన్న ఫోన్లలో ఇవేం సమస్యలు అంటూ కస్టమర్లు కూడా పెదవి విరుస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: