రిలయన్స్ జియో పుణ్యమా అని 4జీ విషయంలో అన్ని కంపెనీ లూ తమ తమ ఆఫర్ రేట్ లని తగ్గించాల్సి ఒస్తోంది. ఎంత పెద్ద నెట్వర్క్ అయినా సరే డబ్బుల విషయం మాత్రమే వినియోగదారుడు ప్రాధాన్యం ఇవ్వడం తో తేలికైన ప్లాన్ ల అమలు చెయ్యడం మొదలు పెట్టారు అందరూ. జియో తాకిడి ఇప్పటికే చాలా ఎక్కువగా ఉండడం ఈ ఇబ్బందికి కారణం. ప్రధాన సంస్థ ఎయిర్టెల్ ఇప్పటికే జియో ఒత్తిడి మేరకు రకరకాల ఆఫర్లు ప్రకటించింది. ఇప్పుడు మరొక కొత్త ప్యాక్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. తాము అందిస్తోన్న 4జీ ప్యాక్ ద్వారా తమ వినియోదారులు తొంభై రోజుల పాటు ఫ్రీగా ఇంటర్నెట్ ని వాడుకోవచ్చు అని దాదాపు జియో లాంటి ప్లాన్ నే తెలిపింది. అయితే దీనికోసం పాత సిమ్ వాడుతున్న వారు 1495 రీచార్జ్ నీ కొత్త సిమ్ తీసుకునే వారు 1494 తో రీచార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ ప్యాక్ ని మొదట డిల్లీ లో లభ్యం అయ్యేలా చేసింది ఎయిర్టెల్.  దేశంలోని మిగ‌తా అన్ని రాష్ట్రాల్లోనూ త్వ‌ర‌లోనే ఈ ఆఫ‌ర్‌ను అందుబాటులో ఉంచుతామ‌ని తెలిపింది. తాము ప్ర‌క‌టించిన ఈ ఆఫ‌ర్‌తో త‌మ క‌స్ట‌మ‌ర్లు 24 గంటలూ ఆన్‌లైన్‌లో ఉండవ‌చ్చ‌ని, తరచూ రీఛార్జ్‌లు చేసుకునే అవ‌స‌రం కూడా ఉండ‌బోద‌ని ఎయిర్‌టెల్ పేర్కొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: