ఒక్క సెనకులోనే సినిమా డౌన్ లోడ్ చేసుకునేంత వేగంగా ఇంటర్నెట్ సేవలందిస్తాం.. సెప్టెంబర్ లో రిలయన్స్ జియో ఉచిత సర్వీసులను పరిచయం చేస్తున్న సమయంలో సంస్థ అధినేత ముఖేష్ అంబానీ చెప్పిన మాట. అందుకు అవసరమైన టెక్నాలజీని రిలయన్స్ అందిపుచ్చుకుంది. 


రిలయన్స్ జియో గిగా ఫైబర్ పేరుతో ఫైబర్ టూ ది హోమ్ వైర్డ్ నెట్ వర్క్ పై స్పీడ్ టెస్ట్ జరిపింది. సెకనుకు 1 గిగా బైట్ వేగాన్ని అందుకుంది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ముంబై, పూణే ప్రాంతాల్లోని కొన్ని చోట్ల ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నట్టు తెలిపారు. బ్రాడ్ బ్యాండ్ విషయంలో రిలయన్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ సిగ్నల్ కమర్షియల్ లాంచింగ్ మరో రెండు నెలల్లో ఉండొచ్చని తెలుస్తోంది.


మరోవైపు నెట్ వర్క్ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు మరిన్ని ప్రాంతాలకు సిగ్నల్స్ అందుబాటులోకి తెచ్చేందుకు మరో రూ.30 వేల కోట్ల పెట్టుబడి పెట్టాలని రిలయన్స్ జియో ఇన్ఫో కామ్ తెలిపింది. దీంతో మొత్తం నెట్ వర్క్ పై పెట్టుబడి రూ.1.9లక్షల కోట్లకు చేరుతుందని సంస్థ వెల్లడించింది. రైట్ ఇష్యూకు బోర్డు డైరెక్టర్లు కూడా ఆమోదం తెలిపారని.. డిజిటల్ సేవల వృద్ధికి గల అవకాశాలను పరిశీలించాక, అదనపు పెట్టుబడి ప్రతిపాదన చేశామని నివేదికలో రిలయన్స్ వెల్లడించింది. పది రూపాయల విలువైన ఆప్షనల్లీ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేరును 40 రూపాయల ప్రీమియంపై 600 కోట్లు జారీ చేయడం ద్వారా30 వేల కోట్లు రాబడతామని వివరించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: