స్మార్ట్ ఫోన్ తయారీల రంగం లో సైలెంట్ అయిపోయిన నోకియా ఇప్పుడు సాఫ్ట్ వేర్ రంగం లో తన సేవలు విస్తరించే పని లో పడింది. దీని కోసం నెట్‌వర్క్ పరికరాల తయారీ సంస్థ కాంప్‌టెల్‌ను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఆ సంస్థకు రూ.2470 కోట్ల భారీ ఆఫర్ ప్రకటించింది. ఫిన్‌ల్యాండ్‌కు చెందిన ఈ కంపెనీ ఒక్కో షేర్‌ను 3.04 యూరోలకు కొనుగోలు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇది కాంప్‌టెల్ గత ముగింపు షేర్ ధర కన్నా ఎంతో ఎక్కువ. నోకియా ఆఫర్‌పై కాంప్‌టెల్ నుంచి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: