ఇన్ఫోసిస్ బోర్డు డైరెక్టర్ లకి వ్యతిరేకంగా మొదలైన యుద్ధాన్ని ఆపేస్తున్నా అంటూ ఆ సంస్థ వ్యవస్థాపకుడు మాజీ చైర్మన్ నారాయణమూర్తి వ్యాఖ్యానించారు. ఇన్ఫోసిస్ నిర్వాహణ మీద వచ్చిన ప్రశ్నలకి సంస్థ స్వయంగా సమాధానాలు ఇస్తుంది అని ఆయన అన్నారు. ఇన్ఫీని తలెత్తుకు నిలిచేలా చేసిన నారాయణమూర్తి, ఇతర సహ వ్యవస్థాపకులతో కలసి ప్రస్తుత మేనేజ్ మెంట్ వివాదాస్పద నిర్ణయాలపై పలు ప్రశ్నలు లేవనెత్తిన సంగతి తెలిసిందే. కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విశాల్ వేతనం పెంపుతో పాటు ఇతర ఉద్యోగులకి భారీ ప్యాకేజీలు ఇవ్వడం పై మూర్తి సహా నందన్ నిలేకని, క్రిస్ గోపాలకృష్ణన్ తదితరులు బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ విషయంలో మరింతగా లాగితే, సంస్థకున్న మంచి పేరు దెబ్బతింటుందన్న ఉద్దేశంతోనే విమర్శల యుద్ధాన్ని ఆపాలని మూర్తి నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇక వ్యవస్థాపకులే ఇలా ప్రశ్నించడంతో మార్కెట్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ సైతం నశించగా, గత సెషన్లలో ఇన్ఫీ ఈక్విటీ విలువ కూడా పతనమైన సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: