మార్కెట్ లోకి అడుగు పెట్టడమే సంచలనమైన ఆఫర్ లతో రంగం లోకి దిగిన రిలయన్స్ జియో సంస్థ వినియోగదారుల ప్రేమ ని చూరగొంది. మొబైల్ డేటా చరిత్ర లో ఫ్రీ గా ఫోన్ నీ ఇంటర్నెట్ నీ వాడుకోగలం అని ఎవ్వరూ ఊహించను కూడా ఊహించలేదు. అమెరికాలోని మొత్తం మొబైల్ నెట్‌వర్క్‌లపై వినియోగమవుతున్న డేటాను జియో చందాదారులు ఒక్కరే వినియోగిస్తున్నారు.


ఇక జియో యూజర్స్ వినియోగిస్తున్న డేటా చైనాలో వినియోగమవుతున్న డేటా కంటే 50 శాతం ఎక్కువని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) సోమవారం రాత్రి వివరాలు వెల్లడించింది. ప్రతి రోజు 110 కోట్ల జీబీ డేటా ట్రాఫిక్, 220 కోట్ల వాయిస్, వీడియో నిమిషాలతో ప్రపంచంలోనే జియో అతిపెద్ద నెట్‌వర్క్‌గా అవతరించినట్టు తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: