టెక్నాలజీ రంగంలో ముఖ్యంగా కంప్యూటర్ రంగంలో హెచ్ పి ప్రింటర్లకు ఎంత డిమాండ్ ఉందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  హెచ్ పి ప్రింటర్స్ ఇప్పటికే ఎన్నో రకాల కొత్త కొత్త ఫ్యూచర్స్ తో మార్కెట్ లోకి వస్తున్నాయి.  భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో తీసుకు వచ్చిన జీఎస్టీ బిల్ ప్రభావం ఇప్పుడు కంప్యూటర్ రంగంపై భారీగానే పడింది.
Image result for hp printers
ఇక హెచ్‌పీ.. మల్టీ ఫంక్షనల్ ప్రింటర్లు (ఎంఎఫ్‌పీ), క్యార్ట్రిడ్జ్‌ల ధరలను గరిష్ఠంగా 15శాతం పెంచింది.  సింగిల్ ఫంక్షన్ ప్రింటర్లు, నోట్‌బుక్‌లు, డెస్క్‌టాప్ కంప్యూటర్ల ధరలను మాత్రం యథాతథంగా కొనసాగించనున్నట్లు హెచ్‌పీ తెలిపింది. ఎంఎఫ్‌పీలపై 8-10 శాతం, ఇంక్ క్యార్ట్రిడ్జ్ లపై12-15 శాతం మేర పెంచినట్లు సంస్థ వెల్లడించింది.
Image result for gst
గతంలో ఎంఎఫ్‌పీలపై పన్నురేటు 18 శాతం స్థాయిలో ఉండగా.. జీఎస్టీ హయాంలో 28 శాతానికి పెరిగింది. అలాగే, ఇంక్ క్యార్ట్రిడ్జ్‌లపై గతంలో పన్ను రేటు 15-18 శాతంగా ఉండగా.. ఇప్పుడది 28 శాతానికి చేరుకుంది. జీఎస్టీ చట్టంలోనూ నోట్‌బుక్‌లపై పన్నురేటును 18 శాతంగానే ఉంచారు.


మరింత సమాచారం తెలుసుకోండి: