సేవింగ్స్ ఖాతాల‌కు వ‌డ్డీ త‌గ్గించిన త‌ర్వాత లోన్స్ విష‌యంలో క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ర్షించ‌డానికి ఎస్‌బీఐ  వినూత్నమైన నిర్ణయం తీసుకుంది. చాలావ‌ర‌కు రీటెయిల్ లోన్స్‌పై ప్రాసెసింగ్ ఫీజును ఎత్తేసింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ).

 తాజాగా కారు లోన్లు, బంగారం లోన్లు, ప‌ర్స‌న‌ల్ లోన్స్‌పై వంద శాతం వ‌ర‌కు ప్రాసెసింగ్ ఫీజును ఎత్తేస్తున్న‌ట్లు సోమ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.ఈ ఏడాది డిసెంబ‌ర్ 31లోపు కారు లోన్లు తీసుకునేవాళ్లంద‌రికీ ప్రాసెసింగ్ ఫీజు నుంచి మిన‌హాయింపునిచ్చారు.

 ఇక అక్టోబ‌ర్ 31లోపు గోల్డ్ లోన్స్ తీసుకునేవారికి 50 శాతం, సెప్టెంబ‌ర్ 30లోపు ప‌ర్స‌న‌ల్ లోన్స్ (ఎక్స్‌ప్రెస్ కార్డ్‌) తీసుకునేవారికి 50 శాతం ఫీజును మిన‌హాయించారు. ఇప్ప‌టికే ఇత‌ర బ్యాంకుల నుంచి తీసుకున్న హోమ్ లోన్స్‌ను ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకున్నా.. ఫీజు వ‌సూలు చేయ‌డం లేదు ఎస్‌బీఐ. 


మరింత సమాచారం తెలుసుకోండి: