ఎంతో ప్రతిభ ఉండి కూడా సరైన అవకాశం లభించక చాలా మంది విద్యార్థులు తమ భవిష్యత్ కోసం మంచి ప్రణాళికలు సిద్దం చేసుకోలేక పోతున్నారు. పేద విద్యార్థులకు చదువు ఉండి కూడా సరైన రీతిలో రాణించలేక పోతున్నారు.  అలాంటి వారికోసం తెలంగాణ లో గురుకుల ప్రవేశం కోసం దరఖాస్తులకు ఆహ్వానం పలుకుతుంది.  2016-17 విద్యా సంవత్సరానికి వరంగల్, మన్ననూర్ ప్రతిభా జూనియర్ కాలేజీల్లో, ఖమ్మంలో గల ప్రతిభా పాఠశాలల్లో, ఐఐటీ స్టడీ సెంటర్ రాజేంద్రనగర్, హైదరాబాద్‌లో ఇంటర్ ఫస్ట్ ఇయర్‌తోపాటు జేఈఈ మెయిన్/అడ్వాన్స్‌డ్ కోచింగ్ ప్రవేశం కొరకు జరుగే ప్రవేశ పరీక్షకై అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 


దీని కోసం 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరు అవుతున్న తెలంగాణ బాల బాలికలు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తుంది.   దరఖాస్తు ఫారాల నమూనా, పంపించాల్సిన చిరునామా గురుకులం వెబ్‌సైట్ చూడవచ్చు. తెలంగాణ గురుకుల పాఠశాలలు లేదా కళాశాలలు నుంచి వివరాలను, ఆన్‌లైన్‌లో దరఖాస్తులను పంపించవచ్చు. దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేది: 2016 ఫిబ్రవరి 10. ఇక ప్రవేశ పరిక్ష ప్రవేశ పరీక్ష (మొదటి దశ): 2016 ఫిబ్రవరి 14 (ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు) మెరిట్‌లిస్ట్ ఫస్ట్ లెవల్: 2016 ఫిబ్రవరి 19,  ప్రవేశ పరీక్ష (రెండో దశ): 2016 మార్చి 13 (ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు) రెండో దశ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల: 2016 మార్చి 24 ,కౌన్సెలింగ్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తేది: 2016 ఏప్రిల్ 12, అకడమిక్ క్లాస్‌లు  2016 జూన్ 1 ప్రారంభం కానున్నాయి. పూర్తి వివరాలు కోసం www.tgtwgurukulam.telangana.gov.in  వెబ్ సైట్ లో చూడవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: