రాష్ట్రంలోని వివిధ గురుకుల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 2,444 పోస్టుల భర్తీలో అమలు చేయాల్సిన పరీక్షల విధానాన్ని ప్రభుత్వం ఖరారు చేసింది. టీఎస్‌పీఎస్సీ మొదటిసారిగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీని చేపడుతుండడంలో కొత్త విధానాన్ని రూపొందించింది. రెండంచెల విధానంలో (ప్రిలిమినరీ, మెయిన్) ఈ పరీక్షలను నిర్వహించాలని స్పష్టం చేసింది. దీనిని చేపట్టేందుకు పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌కు అనుమతించింది. 



గురుకుల పాఠశాలల్లోని ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ (టీజీటీ), పోస్టుగ్రాడ్యుయేట్‌ ఉపాధ్యాయులు (పీజీటీ), ప్రత్యేక (ఆర్ట్‌, క్రాఫ్ట్, సంగీత)ఉపాధ్యాయులు, గురుకుల జూనియర్‌ కళాశాలల అధ్యాపకులు, డిగ్రీ కళాశాలల అధ్యాపకులు, వ్యాయామ సంచాలకుడు (ఫిజికల్‌ డైరెక్టర్‌) పోస్టులకు, ప్రిన్సిపాళ్ల పోస్టులకు నిర్వహించాల్సిన పరీక్షలు, వాటిల్లోనూ పాఠ్యాంశాలు, వాటికి కేటాయించిన మార్కులకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆబ్జెక్టివ్‌ తరహా విధానంలో రాత పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది. 



ప్రాథమిక, ప్రధాన పరీక్షలు జరుపుతామని తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ గురువారం జీవో 229 జారీ చేశారు. ప్రిన్సిపల్, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీలో 30 మార్కులతో ఇంటర్వ్యూ/డెమాన్‌స్ట్రేషన్/ముఖాముఖి ఉం టుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పోస్టు ల భర్తీకి డిస్క్రిప్టివ్ విధానం అమల్లోకి తెచ్చే ఆలోచనలు జరిగినా, ఆబ్జెక్టివ్ విధానంలోనే పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ఓకే చెప్పింది.



మరింత సమాచారం తెలుసుకోండి: