బ్యాంకు ఉద్యోగార్థులకు అద్భుత అవకాశం వచ్చింది! ఒకే పరీక్షా విధానంతో... పీఓ ఉద్యోగ ప్రకటన వచ్చినవెంటనే వేలసంఖ్యలో క్లర్కు ఉద్యోగాలకు ఐబీపీఎస్‌ భారీ ప్రకటన విడుదల చేసింది. అభ్యర్థులు తగిన వ్యూహం పాటిస్తే లక్ష్యసాధన సులువుగా చేరువ అవుతుంది. 19 బ్యాంకుల్లో 19,243 క్లర్క్ క్యాడర్ ఖాళీలను భర్తీ చేసేందుకు ఐబీపీఎస్ తాజాగా కామన్ రిటన్ ఎగ్జామినేషన్(సీడబ్ల్యూఈ) VIనిర్వహణకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ వివరాలు...



రీక్షల తేదీలు 
ప్రిలిమినరీ: నవంబరు 26, 27; డిసెంబరు 3, 4
మెయిన్‌ పరీక్ష: డిసెంబరు 31, జనవరి 1, 2017
వయః పరిమితి: (1.8.2016 నాటికి) కనిష్ఠం: 20 సంవత్సరాలు గరిష్ఠం: 28 సంవత్సరాలు
కేంద్రప్రభుత్వ నిబంధనమేరకు రిజర్వేషన్‌ క్యాటగిరి అభ్యర్థులకు వయః పరిమితిలో సడలింపు ఉంటుంది.
విద్యార్హతలు: ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణుడైవుండాలి.
పరీక్ష కేంద్రాలు 
ఆంధ్రప్రదేశ్‌లో: చీరాల, చిత్తూరు, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం
తెలంగాణలో: హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌.
త్వరగా... సరిగా 
బ్యాంకు ఉద్యోగ పరీక్షల్లో వేగం, కచ్చితత్వాల మీదనే అభ్యర్థి ఎంపిక అవకాశాలు ఆధారపడివుంటాయి. అంటే త్వరగా కచ్చితమైన సమాధానాలు గుర్తించగలిగే సామర్థ్యం అభ్యర్థి పెంపొందించుకోవాల్సివుంటుంది.
అందుకోసం... పాత ప్రశ్నపత్రాల సాధన చేయాలి. జవాబులు తెలిసిన ప్రశ్నలు ఉన్నా కూడా తక్కువ సమయం ఉండటం వల్ల అవకాశం కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి సరైన జవాబులను వేగంగా గుర్తించాలంటే సన్నద్ధత విస్తృతంగా జరగాలి.



2 దశల్లోనూ రీజనింగ్‌... 
అటు ప్రిలిమ్స్‌లోనూ, ఇటు మెయిన్స్‌లోనూ రీజనింగ్‌ కీలకమైన సబ్జెక్టు. తుది ఎంపిక కోసం పరిగణనకు తీసుకునే రీజనింగ్‌కు మెయిన్స్‌ పరీక్షలో 50 మార్కులను కేటాయించారు. తుది ఎంపికకు మెయిన్స్‌ పరీక్ష మార్కులు ప్రధానం కాబట్టి ఆ ప్రశ్నల స్థాయి కూడా అంత సులువుగా ఉండదు.
ప్రాథమిక అంశాలైనప్పటికీ ప్రశ్నల స్థాయి లోతుగా ఉంటుంది.
ప్రిలిమినరీ పరీక్ష నిమిత్తం అనాలజీ, క్లాసిఫికేషన్‌, సిరీస్‌, ఆల్ఫబెట్‌, నంబర్‌ సిరీస్‌, డైరక్షన్స్‌, కోడింగ్‌-డీ కోడింగ్‌, బ్లడ్‌ రిలేషన్స్‌ మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశాలు ఎక్కువ.
మెయిన్స్‌ పరీక్ష దృష్ట్యా కోడెడ్‌ ఇనీక్వాలిటీస్‌, ఇన్‌పుట్‌-అవుట్‌పుట్‌, పజిల్స్‌, కోడెడ్‌ రిలేషన్స్‌, డెసిషన్‌ మేకింగ్‌, సిలాజిజమ్‌ మొదలైన జనరల్‌ రీజనింగ్‌ ఎబిలిటీ ప్రశ్నలతో పాటుగా తర్కం (లాజిక్‌) ఆధారంగా ఉండే అసంప్షన్స్‌, ఆర్గ్యుమెంట్స్‌, ఎవాల్యుయేటింగ్‌ ఇన్ఫరెన్సెస్‌, కోర్సెస్‌ ఆఫ్‌ యాక్షన్‌, కాజ్‌ అండ్‌ ఎఫెక్ట్‌ నుంచి ప్రశ్నలు రావొచ్చు.
జనరల్‌ రీజనింగ్‌ ప్రశ్నలు హెచ్చుస్థాయిలోనూ, లాజికల్‌ రీజనింగ్‌ ప్రశ్నలు సాధారణ స్థాయిలోనూ ఉంటాయి.
పాత ప్రశ్నపత్రాల, నమూనా పేపర్ల సాధన ఈ విభాగం సన్నద్ధతకు ఎంతో ఉపకరిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: