విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు తెలంగాణ బీసీ, ఈబీసీలకు రూ.20 లక్షల ఆర్థిక సహాయం అందించడానికి సంబంధించి మార్గదర్శకాలు సిద్ధమయ్యాయి. బీసీ సంక్షేమశాఖ కమిషనర్ నుంచి ఈ ప్రతిపాదనలు సచివాలయంలోని బీసీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఎఫ్‌ఏసీ)కి చేరాయి. పరిశీలన తర్వాత వీటికి శాఖాపరంగా ఆమోద ముద్రపడ్డాక అక్కడి నుంచి బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగు రామన్నకు చేరతాయి. తర్వాత సీఎం కేసీఆర్ ఆమోదించాక, తదనుగుణంగా ఆదేశాలు వెలువడనున్నాయి. ఈ పథకం కోసం ముందుగా రూ.200 కోట్ల బడ్జెట్‌ను కేటాయించి..  వెయ్యిమంది బీసీ, ఈబీసీల్లో ఎవరు ముందుగా దరఖాస్తు చేసుకుంటే వారికి వర్తించేలా బీసీ శాఖ ప్రతిపాదించింది.



ఇవీ మార్గదర్శకాలు...
ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల మాదిరిగానే పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల లోపు కుటుంబ వార్షికాదాయం, గ్రామీణ ప్రాంతాల్లో రూ.లక్షన్నర కుటుంబ వార్షికాదాయం ఉండాలి. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలకు వెళ్లేవారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల మాదిరిగానే విద్యార్హతలు, టోఫెల్, ఐఈఎల్‌టీఎస్ వంటి వాటిలో తగిన మార్కులు పొంది ఉండాలి. విదేశాల్లోని ఆయా అర్హతలున్న విశ్వవిద్యాలయాల నుంచి అడ్మిషన్ కోసం ఆఫర్ లెటర్లను పొంది ఉండాలి. పాస్‌పోర్టు, వీసాలు కలిగి ఉండాలి.



ప్రస్తుతం రకరకాల సొసైటీల కింద గురుకులాలు కొనసాగుతుండగా ఒక్కో సొసైటీ పరిధిలో ఒక్కో రకమైన నియామక, సర్వీసు నిబంధనలు అమల్లోకి ఉన్నాయి. అయితే అన్ని గురుకులాలే అయినపుడు ఒక్కో సొసైటీ పరిధిలో ఒక్కో రకమైన నిబంధనలు ఉండటం సరికాదని ప్రభుత్వం భావించింది. అన్ని గురుకులాల్లో పోస్టులు ఒకే రకంగా ఉన్నపుడు సర్వీసు రూల్స్ కూడా ఒకేలా ఉండాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా బీసీ సంక్షేమ గురుకులాలు, ఎస్సీ సంక్షేమ గురుకులాలు, గిరిజన సంక్షేమ గురుకులాలు, మైనారిటీ సంక్షేమ గురుకులాలు, విద్యాశాఖ పరిధిలోని తెలంగాణ ప్రభుత్వ గురుకులాలు అన్నింటిలో ఒకే రకమైన నిబంధనలు అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇదివరకే అన్ని శాఖలను ఆదేశించారు. 



దీంతో ఆయా శాఖలతో విద్యాశాఖ కూడా తమ పరిధిలోని గురుకులాల్లో సర్వీసు రూల్స్ కామన్‌గా ఉండాలన్న నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగా శుక్రవారం జరిగిన తెలంగాణ గురుకులాల సొసైటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన సచివాలయంలో జరిగిన సమావేశంలో చర్చించి కామన్ సర్వీసు రూల్స్‌కు ఓకే చెప్పింది. అలాగే 313 ఉపాధ్యాయ పోస్టులను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేసేందుకు నిర్ణయించింది. గురుకులాల్లోని విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని, యూనిఫారాలు, నోటుపుస్తకాలు, బెడ్డింగ్ మెటీరియల్, ట్రంకు పెట్టెలు, ప్లేట్లు, గ్లాసులు, బూట్లు వంటి సదుపాయాలు కల్పించాలని తీర్మానించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: