వందకోట్లకు పైగా జనాభా ఉన్న భారత దేశంలో.. అత్యధిక శాతం మంది గ్రామీణ ప్రాంత ప్రజలే. గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ పేరుతో ఎన్ని బహుళ జాతి సంస్థలు అడుగుపెట్టినా.. దేశం ప్రగతి పథంలో సాగాలంటే ముందుగా గ్రామీణాభివృద్ధి జరగాలి. గ్రామీణప్రాంత ప్రజలు ఈ ప్రపంచీకరణ పరిస్థితులను తట్టుకునే సామర్థ్యం సొంతం చేసుకోవాలి. పల్లె ప్రజలకు ప్రస్తుత పరిస్థితులపై అవగాహన, అందుకు తగినవిధంగా స్వయం సాధికారత సాధించే ఆత్మవిశ్వాసం నెలకొల్పాలి. ఇది సాధ్యం కావాలంటే.. సరైన మార్గనిర్దేశనం అవసరం. అలా మార్గనిర్దేశనం చేసే కోర్సులే.. గ్రామీణాభివృద్ధి కోర్సులు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెల్ ప్రాజెక్ట్ డెరైక్టర్, సెంటర్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ హెడ్ డాక్టర్ ఎస్.ఎం.ఇలియాస్. కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి దిశగా కృషిచేస్తున్న ప్రస్తుత తరుణంలో.. గ్రామీణాభివృద్ధి కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు గోల్డెన్ కెరీర్ ఖాయం అంటున్న ఇలియాస్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ.. ఆ దిశగా.. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ గ్రామీణాభివృద్ధికి సంబంధించిన కోర్సులకు రూపకల్పన చేసింది. 


Bavitha

ఎన్‌ఐఆర్‌డీ రెసిడెన్షియల్ విధానంలో అందిస్తున్న పీజీ డిప్లొమా ఇన్ రూరల్ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్ కోర్సు. ఈ కోర్సులో చేరేందుకు కనీస అర్హత ఏదైనా విభాగంలో డిగ్రీ. బోధన, కరిక్యులం పూర్తి వినూత్నంగా ఉంటుంది. ఈ కోర్సు కాల వ్యవధి ఏడాది. బ్యాచ్‌లో మొత్తం 50 మంది విద్యార్థులు ఉంటారు. విద్యార్థులను నేరుగా క్లాస్‌రూంలో కూర్చోపెట్టకుండా.. ముందుగా అయిదు రోజులు ఫీల్డ్ విజిట్ పేరిట నిర్దిష్ట గ్రామీణ ప్రాంతాలకు పంపిస్తాం. అయిదు రోజుల తర్వాత విద్యార్థులు ఫీల్డ్ విజిట్‌లో తాము తెలుసుకున్న సమస్యలు, ఇతర అంశాలపై నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత నుంచే క్లాస్ రూం బోధన మొదలవుతుంది. అదేవిధంగా ఏడాది వ్యవధిగల కోర్సులో 45రోజులపాటు ఫీల్డ్ విజిట్ పేరుతో ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ప్రాజెక్ట్‌వర్క్ కూడా తప్పనిసరి. ఇలాంటి బోధన ఫలితంగా కోర్సు పూర్తిచేసుకునే సమయానికి గ్రామీణాభివృద్ధికి సంబంధించిన అన్ని అంశాలపై పరిపూర్ణత లభిస్తుంది.



ప్రస్తుతం ఇన్‌స్టిట్యూట్‌లో పూర్తి రెసిడెన్షియల్ విధానంలో పీజీ డిప్లొమా ఇన్ రూరల్ మేనేజ్‌మెంట్ (పీజీడీఆర్‌డీఎం) కోర్సు, దూర విద్యా విధానంలో పీజీ డిప్లొమా ఇన్ ట్రైబల్ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్, పీజీ డిప్లొమా ప్రోగ్రామ్ ఇన్ సస్టెయినబుల్ రూరల్ డెవలప్‌మెంట్ కోర్సులను అందిస్తున్నాం. ప్రతి కోర్సు కాల వ్యవధి సంవత్సరం. రెసిడెన్షియల్ విధానంలో అందిస్తున్న పీజీ డిప్లొమా ఇన్ రూరల్ మేనేజ్‌మెంట్ విద్యార్థులు కోర్సు పూర్తయ్యేవరకూ తప్పనిసరిగా ఎన్‌ఐఆర్‌డీ క్యాంపస్‌లోని హాస్టల్‌లోనే నివసించాలి. ఇప్పటికే ఆయా ఉద్యోగాలు చేస్తూ.. గ్రామీణాభివృద్ధికి సంబంధించిన కోర్సులపై ఆసక్తి ఉన్నవారికి కలిసొచ్చే కోర్సులు.. దూర విద్యా విధానంలో అందిస్తున్న రెండు కోర్సులు. ముఖ్యంగా స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ పరిధిలోని పలు గ్రామీణాభివృద్ధి పథకాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ఉన్నతికి ఇవి ఎంతో ఉపకరిస్తాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: