ఐబీపీఎస్ ద్వారా పలు బ్యాంకుల్లో క్లర్క్‌లుగా నియామకం ఖరారు చేసుకున్న అభ్యర్థులు భవిష్యత్తులో సీజీఎం లేదా డిప్యూటీ మేనేజింగ్ డెరైక్టర్ స్థాయి వరకు ఎదిగే అవకాశముంది. ప్రారంభంలో క్లర్క్‌గా నియమితులైన వారికి ఆరు నెలల ప్రొబేషన్ ఉంటుంది. సింగిల్ విండో ఆపరేటర్, హెడ్ క్యాషియర్, స్పెషల్ అసిస్టెంట్, యూనివర్సల్ టెల్లర్, అగ్రికల్చర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తించాలి. ఆరు నెలల ప్రొబేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంటే పూర్తి స్థాయిలో నియామకం ఖరారవుతుంది. క్లర్క్ నుంచి మూడేళ్ల అనుభవంతో ట్రైనీ ఆఫీసర్ కావొచ్చు. 


Image result for ibps

ప్రిలిమ్స్.. మెయిన్స్
ఐబీపీఎస్ క్లరికల్ పరీక్ష ప్రిలిమ్స్‌లో ఇంగ్లిష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ నుంచి 100 ప్రశ్నలు 100 మార్కులకు ఉంటాయి. మెయిన్ ఎగ్జామినేషన్‌లో రీజనింగ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ అంశాల నుంచి 200 ప్రశ్నలు 200 మార్కులకు ఉంటాయి. పరీక్షల పరంగా చూస్తే ప్రిలిమ్స్‌కు మూడు నెలలు; మెయిన్స్‌కు నాలుగు నెలలు సమయం అందుబాటులో ఉంది. ఈ సమయాన్ని అభ్యర్థులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేలా ప్రణాళికలు రూపొందించుకోవాలి. సిలబస్ పరంగా ఇంగ్లిష్ లాంగ్వేజ్; రీజనింగ్; క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్/న్యూమరికల్ ఎబిలిటీ అంశాలు రెండు పరీక్షల్లోనూ ఉండటం అభ్యర్థులకు కలిసొచ్చే అంశం. ప్రిలిమ్స్‌లో అడిగే ప్రశ్నల క్లిష్టత స్థాయి కొంత తక్కువగా, మెయిన్స్ క్లిష్టత స్థాయి కొంత ఎక్కువగా ఉంటుంది. అభ్యర్థులు ఈ మూడు విభాగాలకు సంబంధించి మొదటి నుంచే మెయిన్స్ దృక్పథంతో ప్రిపరేషన్ సాగిస్తే ప్రిలిమ్స్‌లో సులువుగా గట్టెక్కొచ్చు.


Image result for ibps

వెయిటేజీ ఆధారంగా
అభ్యర్థులు రెండు నెలల్లో ప్రిలిమ్స్ ప్రిపరేషన్ పూర్తి చేసుకునేలా టైం ప్లాన్ రూపొందించుకోవాలి. ఆయా విభాగాల్లోని పలు అంశాలకు ఇస్తున్న వెయిటేజీ ఆధారంగా ప్రిపరేషన్‌లో కేటాయించాల్సిన సమయాన్ని వర్గీకరించుకోవాలి.
ఇంగ్లిష్ లాంగ్వేజ్: ఈ విభాగంలో ఇడియమ్స్, సెంటెన్స్ కరెక్షన్, వొకాబ్యులరీ, సెంటెన్స్ రీ ఎరేంజ్‌మెంట్, వన్ వర్డ్ సబ్‌స్టిట్యూట్స్‌పై అవగాహన పెంచుకోవాలి. అలాగే కేవలం గ్రామర్‌కే పరిమితం కాకుండా.. జనరల్ ఇంగ్లిష్ నైపుణ్యాలు కూడా పెంచుకోవాలి. దీనికోసం ఇంగ్లిష్ దినపత్రికలు చదువుతూ వాటిలో ఉపయోగిస్తున్న పదజాలం, వాక్య నిర్మాణం వంటి వాటిని పరిశీలిస్తుండాలి. 
న్యూమరికల్ ఎబిలిటీ: ఈ విభాగానికి సంబంధించి అర్థమెటిక్ అంశాల (పర్సంటేజెస్, నిష్పత్తులు, లాభనష్టాలు, నంబర్ సిరీస్, బాడ్‌మాస్ నియమాల)పై పూర్తిగా అవగాహన పొందేలా ప్రాక్టీస్ చేయాలి. వీటితోపాటు డేటా ఇంటర్‌ప్రిటేషన్, డేటా అనాలిసిస్‌లపై ప్రత్యేక దృష్టి సారించాలి.
రీజనింగ్: ఇది కూడా రెండు పరీక్షల్లో (ప్రిలిమ్స్, మెయిన్స్) ఉంటుంది. కోడింగ్-డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, డెరైక్షన్స్, సిలాజిజమ్ తదితర అంశాలను బాగా ప్రాక్టీస్ చేయాలి. 


Image result for ibps

60 రోజుల వ్యవధిలో సిలబస్‌లోని అన్ని అంశాల అధ్యయనం పూర్తిచేసుకున్న తర్వాత అభ్యర్థులు అనంతరం అందుబాటులో ఉన్న సమయంలో గ్రాండ్ టెస్ట్‌లకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రతి రోజు ఒక గ్రాండ్ టెస్ట్ రాసేందుకు ప్రయత్నించాలి. మెయిన్స్ అదనపు విభాగాలు ప్రిలిమ్స్ ప్రిపరేషన్‌తోపాటే మెయిన్స్‌లో అదనంగా ఉండే జనరల్ అవేర్‌నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ అంశాలను కూడా అధ్యయనం చేయాలి. జనరల్ అవేర్‌నెస్ విభాగంలో బ్యాంకింగ్ రంగం పరిణామాలు, విధానాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. నోటిఫికేషన్‌లో విత్ స్పెషల్ రిఫరెన్స్ టు బ్యాంకింగ్ అని స్పష్టంగా పేర్కొన్నారు. కాబట్టి బ్యాంకింగ్ రంగంలోని అబ్రివేషన్లు, పదజాలం, బ్యాంకుల విధులు, కొత్త విధానాలు, రిజర్వ్ బ్యాంక్ వంటి వాటిపై పూర్తిగా అవగాహన పెంచుకోవాలి. జనరల్ అవేర్‌నెస్‌లో కరెంట్ అఫైర్స్, స్టాక్ జనరల్ నాలెడ్జ్ కోణంలోనూ ఆర్థిక వ్యవహారాలు (ఎకానమీ, ప్రభుత్వ పథకాల)కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. కంప్యూటర్ నాలెడ్జ్‌కు సంబంధించి ఆపరేటింగ్ సిస్టమ్స్, కంప్యూటర్ స్ట్రక్చర్, ఇంటర్నెట్ సంబంధిత అంశాలు, పదజాలంపై దృష్టి పెట్టాలి. కీ బోర్డ్ షార్ట్‌కట్స్, కంప్యూటర్ హార్డ్‌వేర్ సంబంధిత అంశాల గురించి తెలుసుకోవాలి. ఆన్‌లైన్ విధానంపై అవగాహన ప్రిలిమ్స్, మెయిన్స్ రెండూ ఆన్‌లైన్ విధానంలో జరుగుతాయి. అందువల్ల అభ్యర్థులు ప్రిపరేషన్ సమయంలోనే ఆన్‌లైన్ పరీక్ష విధానంపై అవగాహన పెంచుకోవాలి. గ్రాండ్ టెస్ట్‌లకు ఆన్‌ైలైన్ విధానంలో హాజరైతే మంచిది. 


మరింత సమాచారం తెలుసుకోండి: