లక్షల మంది గ్రూప్స్ అభ్యర్థులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న గ్రూప్- 2 అనుబంధ నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ గురువారం విడుదల చేసింది. గతంలో జారీ చేసిన నోటిఫికేషన్‌లో 439 పోస్టులుండగా.. అదనంగా 593 పోస్టులను చేర్చి మొత్తంగా 1032 పోస్టులను భర్తీ చేయనున్నారు. గ్రూప్ -2 పరీక్ష నవంబర్ 12, 13 తేదీల్లో జరగనుంది. సిలబస్‌ను దృష్టిలో పెట్టుకుంటే.. సమయం తక్కువ, చదవాల్సింది ఎక్కువగా ఉంది. పటిష్ట ప్రణాళికతో ప్రిపరేషన్ కొనసాగిస్తే... గ్రూప్ 2 లక్ష్యం సాధించడం కష్టమేమీ కాదు. ఈ నేపథ్యంలో గ్రూప్-2లో విజయానికి నిపుణుల సలహాలు...


Image result for group 2 tspsc

పరీక్ష విధానం..
ఈ పరీక్ష 675 మార్కులకు ఉంటుంది. ఇందులో ఆబ్జెక్టివ్ పద్ధతిలో 600 మార్కులకు, ఇంటర్వ్యూ 75 మార్కులకు ఉంటాయి. రాత పరీక్షలో నాలుగు పేపర్లుంటాయి. అవి..
రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ పద్ధతి)
పేపర్-1: జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్
సమయం: 2.30 గంటలు. 150 ప్రశ్నలు, 150 మార్కులు
పేపర్-2: హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ
(1. భారతదేశ, తెలంగాణ సాంఘిక సాంస్కృతిక చరిత్ర
2. భారత రాజ్యాంగం, రాజకీయాలు- అవలోకనం
3. సమాజ నిర్మాణం, అంశాలు, ప్రజా విధానాలు)
సమయం: 2.30 గంటలు. 150 ప్రశ్నలు
(ఒక్కో విభాగం నుంచి 50 చొప్పున), 150 మార్కులు.

Image result for group 2 tspsc

పేపర్-3: ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్ 
(1. భారత ఆర్థిక వ్యవస్థ: అంశాలు, సవాళ్లు
2. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి
3. అభివృద్ధి, మార్పు అంశాలు) 
సమయం: 2.30 గంటలు. 150 ప్రశ్నలు
(ఒక్కో విభాగం నుంచి 50 చొప్పున), 150 మార్కులు.
పేపర్-4: తెలంగాణ మూవ్‌మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్
(1. తెలంగాణ తొలి దశ - ది ఐడియా ఆఫ్ తెలంగాణ (1948-1970)
2. ఉద్యమ దశ (1971-1990)
3. తెలంగాణ ఏర్పాటు దశ - ఆవిర్భావం (1991-2014)
సమయం: 2.30 గంటలు. 150 ప్రశ్నలు (ఒక్కో విభాగం నుంచి 50 చొప్పున), 150 మార్కులు.


మరింత సమాచారం తెలుసుకోండి: