తెలంగాణలో గ్రూపు-2 పరీక్ష రాసేందుకు రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. 1,032 పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈనెల 26 వరకు దరఖాస్తులను స్వీకరించగా, 8,18,926 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. చివరి గడువు సోమవారం అర్ధరాత్రితో ముగియడంతో కొంత మంది అభ్యర్థుల ఫీజు చెల్లింపు వివరాలు ఆయా బ్యాంకుల నుంచి ఇంకా అందలేదు. బుధ, గురువారాల్లో అవీ అందనున్నాయి.

Image result for group 2
ఏపీ నుంచి 11,346 మంది :  ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి 11,346 మంది పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేశారు. మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, కర్ణాటక, బిహార్ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు 200 నుంచి 300 మంది చొప్పున దరఖాస్తు చేశారు. కేరళ, మధ్యప్రదేశ్, తమిళ నాడు అభ్యర్థులు ఒక్కో రాష్ట్రం నుంచి 100 మందికిపైగా దరఖాస్తు చేశారు. మొత్తంగా ఇతర రాష్ట్రాల వారు 23,628 మంది దరఖాస్తు చేసుకున్నారు. కరీంనగర్ నుంచి అత్యధికం : గ్రూపు-2 పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసిన అభ్యర్థుల్లో కరీంనగర్ నుంచి ఎక్కువ మంది (1,15,315) దరఖాస్తు చేసుకున్నారు. తక్కువ దరఖాస్తులు నిజామాబాద్ జిల్లా నుంచి 48,015 వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: