డ్రైవర్, ప్లంబర్, పని మనిషి, సెక్యూరిటీ గార్డ్, ఇండస్ట్రియల్ లేబర్, మెకానిక్, కార్పెంటర్...ఇలాంటి చిన్నాచితకా ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్లెందరో. పెద్ద ఉద్యోగాల మాదిరి వీటికి పత్రికల్లో ప్రకటనలు ఉండవు. వీరు ఆన్లైన్ జాబ్ నెట్వర్కింగ్ సైట్లలో రిజిస్టర్ కాలేరు. అలాగే ఈ ఉద్యోగాలు ఎక్కడ ఉంటాయో కూడా అభ్యర్థులకు పెద్దగా తెలీదు.