ఆంధ్రప్రదేశ్లో ఇటీవల నిర్వహించిన స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సెట్) 2016 ఫైనల్ కీ తప్పుల తడకగా మారింది. 31 సబ్జెక్టుల్లో ఒక ఆప్షనల్ అయిన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2, 3లో మూడు తప్పులు దొర్లాయి. ఫైనల్ ‘కీ’ లో కూడా తప్పులున్నాయంటూ అభ్యర్థులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది.