మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ (నాన్‌-టెక్నికల్‌) పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నుంచి ప్రకటన విడుదలయింది. పదో తరగతి ఉత్తీర్ణత ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాలలోని పోస్టులను దీని ద్వారా భర్తీ చేస్తారు. తక్కువ విద్యార్హతతోనే కేంద్రప్రభుత్వ ఉద్యోగం పొందటమే కాకుండా గెజిటెడ్‌ పోస్టు వరకూ పదోన్నతులకు వీలున్న పోస్టులివి! కేంద్రప్రభుత్వ అన్ని శాఖల్లోని గ్రూప్‌-‘సి’ పోస్టులను మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ (ఎంటీఎస్‌) గా పిలుస్తారు. వీరికి నెలవారీ రూ. 20,000 జీతం వస్తుంది. దీనితో పాటు ఇతర సౌకర్యాలు కూడా వర్తిస్తాయి. డిపార్ట్‌మెంటను బట్టి వీరికి పదోన్నతులు ఉంటాయి.ఎంటీఎస్‌ పాతికేళ్ళ వయసులో ఉద్యోగంలో చేరితే ఉద్యోగ విరమణనాటికి గెజిటెడ్‌ అధికారి పోస్టు వరకూ చేరుకోవచ్చు.


Image result for multi tasking staff

ఆదాయపు పన్ను శాఖలోని ఎంటీఎస్‌ ఉద్యోగ విరమణ నాటికి ఇన్‌కంటాక్స్‌ ఆఫీసర్‌ పోస్టుకు చేరవచ్చు. ఏజీ ఆఫీసులోని ఎంటీఎస్‌ ఉద్యోగ విరమణ నాటికి ఆడిట్‌ ఆఫీసర్‌ పోస్టు వరకూ చేరవచ్చు.ఎస్‌ఎస్‌సీ-ఎంటీఎస్‌ పరీక్షకు తయారయ్యే అభ్యర్థులు ఇదే సన్నద్ధతతో ఎస్‌ఎస్‌సీ నిర్వహించే కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవెల్‌ (CHSL)పరీక్ష కూడా రాయవచ్చు.వయః పరిమితి, మినహాయింపులు ఆగస్టు 1, 2017 నాటికి పదో తరగతి పూర్తిచేసిన అభ్యర్థులు ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్‌ రాతపరీక్షకు అర్హులు. అలాగే 01-08-2017 నాటికి 18-25 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.SC/STకేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, PHకేటగిరీ అభ్యర్థులకు 10 సంవత్సరాల మినహాయింపు ఉంది.దరఖాస్తు పూర్తి చేయటానికి ఆఖరు తేదీ: 30-01-2017రాత పరీక్ష తేదీలు: 16-04-2017, 30-04-2017, 07-05-2017అర్హతలు కలిగిన అభ్యర్థులు http://ssconline.nic.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ దరఖాస్తు పూర్తిచేసి 100 రూపాయల పరీక్ష ఫీజు చెల్లించాలి.* మహిళలు, SC/STకేటగిరీ అభ్యర్థులు ఉచితంగా ఈ పరీక్షను రాయవచ్చు. దరఖాస్తు ఆన్‌లైన్‌లో పూర్తి చేయాలి.పరీక్ష విధానం అభ్యర్థుల ఎంపిక రెండు పేపర్ల ఆధారంగా జరగనుంది. (పేపర్‌-1) ఆబ్జెక్టివ్‌ రాత పరీక్ష (పేపర్‌-2) డిస్క్రిప్టివ్‌ పరీక్షపేపర్‌-1ను అభ్యర్థులు రెండు గంటల వ్యవధిలో పూర్తి చేయాలి. 150 ప్రశ్నలు ఉంటాయి.












మరింత సమాచారం తెలుసుకోండి: