ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ద్వారా కాకుండా వైద్యుల నియామకాలను శాఖాపరంగానే చేపట్టే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఏపీపీఎస్సీ తరహాలోనే నియామకాల ప్రక్రియను చేపడతామని పేర్కొన్నారు. విజయవాడలో బుధవారం(ఫిబ్రవరి 15) వైద్య, ఆరోగ్య శాఖపై మంత్రి కామినేని శ్రీనివాస్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. రెండు రాష్ట్రాల్లో కలిపి వైద్య విద్య పీజీలో 2,900 సీట్లు ఉండగా 6500 మంది మాత్రమే నీట్ ద్వారా అర్హత సాధించారని తెలిపారు.


Related image

దీనివల్ల సీట్లు మిగిలిపోకుండా ఉండేందుకు మరింత మంది విద్యార్థులు అర్హత సాధించేలా కటాఫ్(1:5 నిష్పత్తిలో)ను మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని పునరుద్ఘాటించారు. అలాగే యూజీ సీట్ల భర్తీకి నిర్వహించే పరీక్ష(నీట్)ను రాష్ట్రంలో విజయవాడ, విశాఖపట్నం నగరాతోపాటు.. రాజమండ్రి, తిరుపతి, కర్నూలు నగరాల్లోనూ నిర్వహించాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలిపారు. వీటిపై ఫిబ్రవరి 20న దిల్లీలో చర్చించబోతున్నామని చెప్పారు. పీజీ విద్యార్థులకు గ్రేస్ మార్కులను కలిపే అవకాశమేలేదన్నారు. కిందటేడాది ప్రత్యేక పరిస్థితుల్లో గ్రేస్ మార్కులను కలిపామని.. ఇక అలా జరిగే అవకాశమే లేదని మంత్రి వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: