తెలంగాణ సెట్ (స్టేట్ ఎలిజిబులిటీ టెస్టు) ప్రకటన వెలువడింది. గురువారం(ఫిబ్రవరి 16) ఉస్మానియా విశ్వవిద్యాలయ అతిథిగృహంలో వీసీ ఆచార్య రామచంద్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ప్రకటన ఇచ్చామని, పారదర్శకంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఫిబ్రవరి 22 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందన్నారు. గతంలో సెట్‌కు 27 సబ్జెక్టులు మాత్రమే ఉండేవని, ఈసారి లింగ్విస్టిక్స్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్‌ను కూడా చేర్చినట్లు వివరించారు. ఆదిలాబాద్‌లో ప్రాంతీయ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ గోపాల్‌రెడ్డి, ఓఎస్‌డీ ఆచార్య లింబాద్రి, టీఎస్ సెట్ కార్యదర్శి యాదగిరిస్వామి పాల్గొన్నారు. 


Image result for osmania university

* ఆన్‌లైన్‌లో ఓఎంఆర్ షీట్ పరీక్షకు సంబంధించి తుది కీ విడుదల చేసిన తర్వాత ఓఎంఆర్ షీట్‌ను ఆన్‌లైన్‌లో ఉంచనున్నట్లు వీసీ వివరించారు. దీంతో అభ్యర్థులు స్వీయమూల్యంకనం చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. సిలబస్ కూడా యూజీసీ నెట్ మాదిరిగానే ఉందన్నారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.1,000, బీసీ రూ.800, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500 రుసుం ఉంటుందన్నారు. బయోమెట్రిక్ విధానం ఉందన్న విషయాన్ని అభ్యర్థుల గమనించాలన్నారు. * ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 22.02.2017 * అపరాధ రుసుం లేకుండా: 20.03.2017 * రూ.1,500 అపరాధ రుసుంతో...: 30.03.2017 * రూ.2,000 అపరాధ రుసుంతో...: 06.04.2017 * రూ.3,000 అపరాధ రుసుంతో...: 01.05.2017 * హాల్‌టికెట్లు డౌన్‌లోడ్: 20.05.2017 నుంచి * పరీక్ష తేదీ: 11.06.2017

మరింత సమాచారం తెలుసుకోండి: