ఎంసెట్ షెడ్యూల్-2017 విడుదల చేసింది తెలంగాణ JNTU. ఫిబ్రవరి 27వ తేదీ నోటిఫికేషన్ విడుదల అవుతుంది. మే 12వ తేదీన ఎగ్జామ్ ఉంటుంది. అదేనెల 22వ తేదీ ఫలితాలు వెల్లడి అవుతాయి. మార్చి 3 నుంచి ఏప్రిల్ 3వ తేదీ ఆన్ లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తులు సరిదిద్దుకునేందుకు ఏప్రిల్ 7 నుంచి 20వ తేదీ వరకు అవకాశం ఉంటుంది.

Image result for inter students writing eamcet

రూ.500 జరిమానాతో దరఖాస్తుకు ఏప్రిల్ 12వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. రూ.1000 ఫైన్ తో అప్లికేషన్ దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 21వ తేదీ వరకు గడువు ఇచ్చారు. రూ.5వేల ఫైన్ తో ఏప్రిల్ 29వ తేదీ వరకు అవకాశం ఉంది. రూ.10వేల ఫైన్ తో మే 8వ తేదీ వరకు కూడా ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. హాల్ టికెట్ ను మే ఒకటి నుంచి 9వ తేదీ వరకు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఇంజనీరింగ్ ఎగ్జామ్ టైం : ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు

అగ్రికల్చరల్ అండ్ మెడిసిన్ : మధ్యాహ్న 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు

ఎగ్జామ్ ప్రిలిమినరీ కీ విడుదల : మే 13వ తేదీ, 2017

ప్రిలిమినరీ కీపై అభ్యంతరాల స్వీకరణ చివరి తేదీ : మే 18, 2017

ఫలితాల విడుదల : మే 22, 2017

పరీక్ష ఫీజు : ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ కు రూ.250, జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ కు రూ.500

Image result for inter students writing eamcet

 2017కు సంబంధించి ఈసెట్ పరీక్ష షెడ్యూల్ ను JNTU విడుదల చేసింది. దరఖాస్తులు ఆన్ లైన్ ద్వారానే స్వీకరిస్తామని JNTU తెలిపింది

షెడ్యూల్ :

ఈ సెట్ నోటిఫికేషన్ విడుదల : 27-02-2017

ఆన్ లైన్లో దరఖాస్తులు స్వీకరణ : 02-03-2017

జరిమానా లేకుండా దరఖాస్తులు స్వీకరణ : 07-04-2017

సబ్మిట్ చేసిన దరఖాస్తుల మార్పునకు చివరి తేదీ : 15-04-2017 నుంచి 20-04-2017

రూ.500 అపరాధ రుసుముతో దరఖాస్తుల స్వీకరణ : 13-04-2017

రూ.1000 అపరాధ రుసుముతో దరఖాస్తుల స్వీకరణ : 20-04-2017

రూ.5000 అపరాధ రుసుముతో ఆన్ లైన్ అప్లికేషన్ రసీదు పొందేందుకు చివరి తేదీ : 24-04-2017

హాల్ టికెట్ డౌన్ లోడ్ : 29-04-2017 నుంచి 04-05-2017

రూ.10000 అపరాధ రుసుముతో ఆన్ లైన్ అప్లికేషన్ రసీదు పొందేందుకు చివరి తేదీ : 01-05-2017

ఈ-సెట్ పరీక్ష తేదీ : 06-05-2017

పరీక్ష సమయం : మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు

పరీక్ష ప్రాథమిక కీ విడుదల : 08-05-2017

ప్రిలిమినరీ కీ పై అభ్యంతరాలు తెలిపేందుకు చివరి తేదీ : 11-05-2017

ఫలితాలు విడుదల తేదీ : 15-05-2017

ర్యాంక్ కార్డుల డౌన్ లోడ్ : 17-05-2017

 


మరింత సమాచారం తెలుసుకోండి: