కానిస్టేబుల్ నియామకాల్లో తమ ఎంపికకు సంబంధించి అనుమానాలుంటే ఫిబ్రవరి 24వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 27 అర్ధరాత్రి వరకూ సవాలు (ఛాలెంజ్) చేయవచ్చని తెలంగాణ పోలీసు నియామక మండలి ఛైర్మన్ పూర్ణచంద్రరావు తెలిపారు. ఈ మేరకు గురువారం(ఫిబ్రవరి 23) ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఫిబ్రవరి 17న కానిస్టేబుల్ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. అనేక మంది అభ్యర్థులు తమకు అన్యాయం జరిగిందని ఆరోపించిన నేపథ్యంలో నియామక మండలి ఈ అవకాశాన్ని కల్పించింది.


Image result for telangana police recruitment

మండలి వెబ్‌సైట్ ద్వారానే తమ సమస్యకు సంబంధించి సవాలు చేయాల్సి ఉంటుంది. మెరిట్ జాబితా, కటాఫ్‌మార్కులు, ర్యాంకు వంటి వాటిని తమ రిజర్వేషన్ విభాగంలో చూసుకోవాలని.. ఏమైనా అనుమానాలు ఉన్నప్పుడు మాత్రమే సవాలు చేయాలని ఆయన సూచించారు. ఓసీ, బీసీ అభ్యర్థులయితే రూ.5వేలు, ఎస్సీ, ఎస్టీలయితే రూ.2వేల చొప్పున ఆన్‌లైన్ ద్వారానే చెల్లించి ఆ తర్వాతే సవాలు చేయాలన్నారు. అనుమానాలు నిజమైతే ఫీజు వెనక్కి చెల్లిస్తామని పూర్ణచంద్రరావు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: