కేంద్రీయ పాఠశాల విద్యా మండలి(సీబీఎ్‌సఈ) విద్యలో సంస్కరణలకు పూనుకుంది. ప్రస్తుతం పదో తరగతి విద్యార్థులకు 5 సబ్జెక్టులు ఉండగా.. వచ్చే విద్యా సంవత్సరం(2017-18) నుంచి వాటిని ఆరుకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటిదాకా విద్యార్థులు రెండు భాష, గణిత, సామాన్య, సాంఘిక శాస్త్రం చదువుతుండగా, వృత్తి సంబంధ సబ్జెక్టు ఐచ్చికంగా ఉండేది. అయితే, జాతీయ నైపుణ్య అర్హత కార్యాచరణ ప్రణాళిక(ఎన్‌ఎ్‌సక్యూఎఫ్‌) కింద వృత్తి సంబంధ సబ్జెక్టును కూడా కచ్చితం చేసింది. గణిత, సామాన్య, సాంఘిక శాస్ర్తాల్లో ఏదేని ఒక సబ్జెక్టులో ఫెయిలయితే వృత్తి సంబంధ సబ్జెక్టును పరిగణనలోకి తీసుకుని పాసయినట్లుగా ప్రకటిస్తామని తెలిపింది. అదే విధంగా, 12వ తరగతిలో లింగ అధ్యయన, మానవ హక్కుల సబ్జెక్టులతో మరో ఐదు ఎలక్టివ్‌, 34 వృత్తి సంబంధ సబ్జెక్టులను తొలగిస్తూ సీబీఎ్‌సఈ నిర్ణయం తీసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: