తెలంగాణ ఎంసెట్‌కు హాజరయ్యే అభ్యర్థులు మార్చి 15వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు కొత్త దరఖాస్తుల ప్రక్రియ షెడ్యూల్‌ను ఎంసెట్‌ కన్వీనర్‌ ఆచార్య యాదయ్య మార్చి 11వ తేదీ రాత్రి ఖరారు చేశారు. దానికి సంబంధించి ప్రకటనను 13 వ తేదీన జారీ చేయనున్నారు. వాస్తవానికి ఫిబ్రవరి 27న ప్రకటన జారీ చేసి... మార్చి 3 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కావాల్సి ఉంది. సర్వీస్‌ ప్రొవైడర్ల టెండర్‌ ఖరారులో తలెత్తిన వివాదంతో 12 రోజులు ఆలస్యమైంది. ప్రభుత్వం మార్చి 10న టెండర్‌ను ఖరారు చేయడంతో 11న కొత్త షెడ్యూల్‌ను విడుదల చేశారు.


Image result for telangana mcet

విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ప్రణాళికను రూపొందించామని ఆచార్య యాదయ్య తెలిపారు.కొత్త షెడ్యూలు ఇలా......* మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ* అపరాధ రుసుముతో మే 8 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.* మే 1 నుంచి 9వరకు వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.* మే 19న ఎంసెట్‌ యథాతథంగా నిర్వహిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: