ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థల్లో 7,982కు పైగా ఖాళీలు ఉన్నాయి. తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఈపీడీసీఎల్), దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఎస్పీడీసీఎల్)లో ఉన్న ఖాళీల భర్తీకి అనుమతి ఇవ్వాలని విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కమ్స్) ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు విన్నవించాయి. విద్యుత్ రంగంపై సమీక్ష నిర్వహించిన సందర్భంలో డిస్కమ్స్ ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాయి.


Image result for ap trans co

క్షేత్రస్థాయిలో లైన్‌మెన్లు, హెల్పర్లు, తదితరుల కొరత ఉంది. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) ప్రజాభిప్రాయసేకరణ నిర్వహించిన సందర్భంగా పలువురు వినియోగదారులు ఇదే విషయాన్ని ఈఆర్‌సీ దృష్టికి తీసుకెళ్లారు. సిబ్బంది కొరత నేపథ్యంలో సకాలంలో స్పందించని కారణంగా విద్యుత్ ప్రమాదాలూ చోటు చేసుకుంటున్నాయని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ ట్రాన్స్‌కోలో 2,747 పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం ఉందని ఆ సంస్థ గుర్తించింది. కొత్తగా సబ్‌స్టేషన్లను నిర్మించే సమయంలో తగిన సిబ్బందిని కూడా నియమించలేని పరిస్థితి ట్రాన్స్‌కోలో ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: